Rashmika Mandanna : తెగ ఊపేస్తున్న రష్మిక మందన్న.. అమ్మ‌డి జోరు మాములుగా లేదుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: June 28, 2022, 1:00 pm

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. కన్నడ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిన ఆమె ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. తెలుగులోను ఈ అమ్మ‌డికి బోలెడ‌న్ని సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా దున్నేస్తున్న ర‌ష్మిక ఒకపక్క ముంబై, మరోపక్క హైదరాబాద్, మరోపక్క చెన్నై అంటూ వరుసగా షూటింగ్ ల కోసం ప్రయాణాలు చేస్తోంది. అయితే ఆమె షూటింగ్ కి వెళ్లే సమయంలో ఆమె పెంపుడు కుక్క ఉండడం లేదని,

ఆమె లేకుండా బెంగ పెట్టుకుంటూ ఉండడంతో తనతో పాటు తన కుక్కపిల్లకు కూడా ఫ్లైట్ టికెట్ లు వేయించాలని నిర్మాతలను రష్మిక కోరినట్టుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కధనాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అందులో ఒక వెబ్సైట్ కథనాన్ని షేర్ చేసిన ఆమె అది నిజం కాదని కొట్టిపారేశారు. ”కమాన్ మరీ ఇంత సిల్లీగా ఉండకండి, నిజంగా మీరు ఆరా(రష్మిక పెంపుడు కుక్క) నాతో పాటు ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నా ఆమె మాత్రం నాతో ట్రావెల్ చేయాలని అనుకోదు, ఆమెకు హైదరాబాద్ లో ఉండటమే చాలా ఇష్టం” అంటూ పేర్కొంది. అయితే ఆ తర్వాత మరోసారి ట్వీట్ చేస్తూ క్షమించండి ఇది చూసి నేను నవ్వు ఆపుకోలేక పోతున్నాను అని ఆమె పేర్కొంది.

Rashmika Mandanna dance with crazy song

Rashmika Mandanna dance with crazy song

Rashmika Mandanna : ర‌ష్మిక జోష్‌..

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ర‌ష్మిక అప్పుడ‌ప్పుడు త‌న క్యూట్ అందాల‌తో క‌వ్విస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు బాడీని షేక్ చేస్తూ క్యూట్ డ్యాన్స్ చేసింది. నాతో పాటు ఎవ‌రైన జాయిన్ అవుతారా అంటూ కామెంట్ కూడా పెట్టింది. ర‌ష్మిక డ్యాన్స్ వీడియో నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అంతేకాక ఆమె వీడియోని తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఒకపక్క తెలుగు మరోపక్క తమిళ అలాగే హిందీ సినిమాలు చేస్తూ ఆమె హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు అనే ద్విభాషా చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp