Rashmika Mandanna : ఐటెం సాంగ్‌కి రష్మికా మందన్నఅంత అడిగిందా.. ఏం మాట్లాడ‌కుండా ఫోన్ క‌ట్ చేసిన డైరెక్ట‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : ఐటెం సాంగ్‌కి రష్మికా మందన్నఅంత అడిగిందా.. ఏం మాట్లాడ‌కుండా ఫోన్ క‌ట్ చేసిన డైరెక్ట‌ర్

 Authored By sandeep | The Telugu News | Updated on :16 March 2022,3:30 pm

Rashmika Mandanna : క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక ఇటీవ‌లి కాలంలోవ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే కోణంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన తీరు ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలతో బిజీ అవుతున్న రష్మిక.. రీసెంట్‌గా ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందట. అయితే ఈ సాంగ్ చేసేందుకు ఆమె చేసిన డిమాండ్ చూసి సదరు సినిమా నిర్మాతలు నివ్వెరబోయినట్లు సమాచారం. ర‌ష్మిక‌కి సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.

ఈ క్ర‌మంలో ఓ ఐటెం సాంగ్ చేయించాలని దర్శకుడు రష్మికను సంప్రదించగా అమ్మడు ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్ చెప్పి షాకిచ్చిందట.బాలీవుడ్ సినిమా కాబట్టే ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ అడిగినట్టు తెలుస్తోంది. దాంతో సందీప్ రెడ్డి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఫోన్ పెట్టేశాడట. సందీప్ – ప్రభాస్ కాంబినేషన్‌లో స్పిరిట్ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఒకవేళ రష్మిక యానిమల్ సినిమాలో ఐటెం సాంగ్ ఒప్పుకొని ఉంటే, ప్రభాస్ సినిమాకు హీరోయిన్‌గా తీసుకునేవారేమో. ఐటెం సాంగ్‌కే ఇంత అడిగితే, ఇక ప్రభాస్ సినిమా అవకాశం ఇస్తారా లేదా అనే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్లు సైతం ఐటెమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుండటం చూస్తున్నాం.

Rashmika Mandanna demands two crores

Rashmika Mandanna demands two crores

Rashmika Mandanna : ర‌ష్మిక మాములు షాక్ ఇవ్వ‌లేదుగా..

రీసెంట్‌గా ‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది సమంత. అంతేకాదు ఈ సాంగ్ చేసినందుకు గాను భారీ రెమ్మ్యూనరేషన్ తీసుకుందని విన్నాం. తాజాగా అదే బాటలో వెళుతోందట ఇండియన్ క్రష్ రష్మిక మందన. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించింది. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను ఈ అమ్మ‌డికి క్రేజీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.ఆమె హీరోయిన్ గా నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది