Rashmika Mandanna : ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా!.. రష్మిక మంద‌న్న‌ పోస్ట్ వైరల్?

Authored By aruna | The Telugu News | Published on: August 10, 2022, 1:20 pm

Rashmika Mandanna : రష్మిక మంద‌న్న‌ తెరపై అంత అల్లరి చేస్తుంటుందో.. బయట కూడా అంతే నాటీగా ఉంటుంది. ఆమె పాత్రలు కూడా ఆమె రియల్ కారెక్టర్‌కు కాస్త దగ్గరగా ఉంటున్నట్టు అనిపిస్తాయి. ఇక ఆమె తన అందంతో ఇప్పుడు కుర్రకారును కట్టిపడేస్తోంది. రష్మిక చేసే పాత్రలు, ఆమె నెట్టింట్లో చేసే సందడికి అభిమానులు ఫిదా అవుతుంటారు. అలా ఆమెకు విపరీతమైన అభిమాన గణం ఏర్పడింది. రష్మిక మందన ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది. సీతారామం సినిమాతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అఫ్రిన్ పాత్రతో రష్మిక మంద‌న్న‌ అందరినీ ఆశ్చర్యపరిచింది.

రష్మిక తన పాత్రతో ఇంత ప్రభావం చూపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అలా రష్మిక ఒక్కసారిగా అందరినీ తన పాత్ర, ఆ నటనతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇప్పుడు రష్మిక తన ఫ్యాన్స్‌తో సందడి చేస్తోంది. సీతారామం కంటే ముందు ఆ సినిమా ప్రమోషన్స్‌లో అంత కనిపించలేదు. ఇక సినిమా హిట్ అవ్వడం, తన పాత్రకు సూపర్ రెస్పాన్స్ రావడంతో మీడియా ముందుకు వచ్చింది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. అలా రష్మిక ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Rashmika Mandanna Funny Post Geoes Viral

Rashmika Mandanna Funny Post Geoes Viral

అయితే తాజాగా ఆమె తన ఇన్ స్టా గ్రాంలో ఓ పోస్ట్ వేసింది. చిన్నతనంలో చేసే నాటీ పనులు ఇప్పుడు కూడా చేసేస్తోందట. ఎవరైనా చిన్నతనంలో పుస్తకాలు వాడినప్పుడు చివరి పేజీలో.. ఏవేవో పిచ్చి గీతలు గీస్తుంటాం.. ఆడవాళ్లు అయితే ముగ్గులు, పూలు గీస్తుంటారు. ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? నేను మాత్రం ఇలాంటివి చేస్తుంటాను అని రష్మిక ఫన్నీగా చెప్పుకొచ్చింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp