Rashmika Mandanna : క‌ష్టాల్లో ర‌ష్మిక‌.. కోర్టు మెట్లు ఎక్కే త‌ప్పు ఏం చేసింది

Authored By Sam C | The Telugu News | Published on: August 7, 2022, 6:00 pm

Rashmika Mandanna : క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందాన గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయ‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు అతి త‌క్కువ స‌మయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌,బాలీవుడ్ ఇలా అన్ని ఇండ‌స్ట్రీల‌లో త‌న హ‌వా చూపిస్తుంది. బాలీవుడ్ లో రెండు సినిమాలకు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటిస్తున్నారు. ఈ రోజు విడుదలైన సీతా రామమ్ లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రష్మిక అందం, అభినయం గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె అందానికి ఫిదా అయ్యారు కాబట్టే.. ఆమె నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించుకున్నారు.

Rashmika Mandanna : ర‌ష్మిక ర‌చ్చ‌..

ప్రజెంట్ బాలీవుడ్ లోవ‌రుస సినిమాలు చేస్తున్న‌ ఈ బ్యూటీ.. తన నెక్స్ట్ సినిమాలో భాగంగా..కొన్ని సీన్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కనుందట. ఈ సినిమా లో అమ్మడి రోల్ చాలా ఢిఫరెంట్ గా ఉంటుందని..బాలీవుడ్ జనాలకి నచ్చుతుందని అంటున్నారు మేకర్స్. ర‌ష్మిక పాత్ర‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తుంది. రష్మిక సహజంగానే చాలా అందంగా ఉంటుంది. కానీ.. తన స్కిన్ విషయంలో ఆమె చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఆ క్ర‌మంలో వ‌రుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది.

Rashmika Mandanna is in troubles

Rashmika Mandanna is in troubles

ర‌ష్మిక క్రేజ్ బాగా పెర‌గ‌డంతో పుష్ప రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” సినిమా కోసం నిర్మాతలు రష్మిక మందన్న కు ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలుగులో మాత్రమే కాక మరోవైపు మూడు నాలుగు బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా ఉంది ఈ భామ. ఇంస్టాగ్రామ్ లో కూడా ఈమెకు బాగానే ఫాలోయింగ్ ఉంది. కానీ కీర్తి సురేష్ సాయి పల్లవి వంటి హీరోయిన్లు కూడా ఇంకా తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమా చేస్తున్నప్పుడు ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి రష్మిక మందన్న ను ఎవరు తీసుకుంటారు అని కూడా ఇప్పుడు డిస్కషన్లు జరుగుతున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp