Rashmika Mandanna : కాలికి గాయంతో అలా దిగాలుగా కూర్చొని ఏదో ఆలోచన చేస్తున్న రష్మిక
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : కాలికి గాయంతో అలా దిగాలుగా కూర్చొని ఏదో ఆలోచన చేస్తున్న రష్మిక
Rashmika Mandanna : అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధాన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పుష్ప2 Pushpa 2సినిమాతో అమ్మడి క్రేజ్ ఫుల్ పెరిగింది. అయితే ఇటీవల రష్మిక జిమ్ లో గాయపడిందని వార్తలు వచ్చాయి. తాను చేస్తున్న సికిందర్ సినిమా షూట్ కూడా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక దీనిపై అధికారికంగా పోస్ట్ చేసింది.. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది.
Rashmika Mandanna : పాపం రష్మిక..
సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన్నా Rashmika Mandanna : . ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైమ్ పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. గాయం నుండి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడుకే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే నేను `థామ`, `సికిందర్`, `కుబేర` చిత్రాల సెట్‌లోకి అడుగుపెట్టగలను.
నేను అవసరమైతే చాలా అధునాతనమైన బన్నీ హోప్ వ్యాయామం చేయడానికి కూడా రెడీగానే ఉంటాను` అని తెలిపింది రష్మిక మందన్నా. దర్శకుల గురించి ఆలోచించి ఆమె ఈ పోస్ట్ పెట్టడం విశేషం. ఇటీవలే అల్లు అర్జున్ Allu Arjunతో కలిసి నటించిన `పుష్ప 2` విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది.