Rashmika Mandanna : ఆయ‌న న‌న్ను హింసించాడు, రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ మిస్ అయ్యా.. ర‌ష్మిక మంద‌న్న‌

Authored By Sam C | The Telugu News | Published on: January 17, 2022, 9:30 pm

Rashmika Mandanna : కన్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ పొందింది. మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల‌తో న‌టించిన ఈ ముద్దుగుమ్మ త‌మిళం, హిందీ భాష‌ల‌లో కూడా న‌టిస్తుంది. అయితే ఈ అమ్మ‌డు చాలా చ‌లాకీగా, ఉత్సాహంగా, అందంగా ఉండేందుకు నిత్యం జిమ్, యోగా వంటివి చేస్తుంటుంది. జిమ్ లో అమ్మడు ఎంత కష్టపడుతుందో ఆమె అప్పుడప్పుడు పెట్టె వీడియోలు చూస్తే తెలుస్తోంది.

ఇక ర‌ష్మిక‌కి ట్రైనర్ గా ఉన్న‌ కులదీప్ సేథీ చాలామంది సెలబ్రేటిస్ కి ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయ‌న తాజాగా రష్మిక న‌టించిన పుష్ప సినిమాలోని సామి సామి సాంగ్‌కి డ్యాన్స్ చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రష్మిక తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది. కులదీప్.. రోజు జిమ్ లో నన్ను టార్చర్ చేస్తాడు.. ఒకే వర్క్ అవుట్ ని పదేపదే చేయమని ఇబ్బందిపెడతాడు.. ఈ సాంగ్ చేసేటప్పుడు నేను పక్కన లేను.. ఒకవేళ ఉండిఉంటే ఒక స్టెప్ ను పదేపదే చేయించి రివెంజ్ తీర్చుకోనేదాన్ని.. ఆ ఛాన్స్ మిస్ అయ్యాను” అని చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజ‌న్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

rashmika mandanna comments on her trainer

rashmika mandanna comments on her trainer

Rashmika Mandanna : ఆ ఛాన్స్ మిస్ అయ్యా…

అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొంద‌గా, ఈ మూవీ దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ ఈ మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించింది. నార్త్‏లోనూ బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమానే కాకుండా.. ఇందులోని పాటలు కూడా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పుష్ప పాటలు ట్రెండ్ అవుతున్నాయి. సామీ.. సామీ…, ఊ అంటావా మావా.. ఊహు అంటావా.., శ్రీవల్లి పాటలు నెట్టింట్లో దుమ్ములేపుతున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp