Rashmika Mandanna Vs Pooja Hegde : పూజా హెగ్డే వర్సెస్ రష్మిక మందన్నా… ఎవరి పారితోషికం ఎక్కువో తెలుసా!
Rashmika Mandanna Vs Pooja Hegde ; తెలుగు స్టార్ హీరోయిన్స్ లో ప్రస్తుతం పూజ హెగ్డే మరియు రష్మిక మందన ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. వీరిద్దరు చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆ మధ్య పుష్ప సినిమా తో రష్మిక మందన తన పారితోషికం ను ఏకంగా రెట్టింపు చేసింది. ఇక అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకోవడంతో పూజ హెగ్డే తన రెమ్యూనరేషన్ ని రెండు నుండి మూడు కోట్ల రూపాయలకు పెంచేసింది.
ఇద్దరు కూడా ప్రస్తుతానికి బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా అడపా దడప్ప సినిమాలు చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. సౌత్ లో తమిళం మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో వైపు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప 2 సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్స్ గా నటిస్తున్న వారికి లభిస్తున్న పారితోషకం

Rashmika Mandanna Vs Pooja Hegde remuneration for there new films
పరిశీలించినట్లయితే పూజా హెగ్డే తో పోలిస్తే రష్మిక మందాన రెమ్యూనరేషన్ ఎక్కువ అన్నట్లుగా సమాచారం అందుతుంది. పుష్ప పార్ట్ 1 లో రష్మిక మందన నటించింది. కనుక సీక్వెల్లో కచ్చితంగా ఆమె కావాల్సి ఉంటుంది. అందుకే రష్మిక మందనాకి కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి దర్శకుడు సుకుమార్ తీసుకున్నాడు. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అందుకే మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే ని ఎంపిక చేసిన త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్త తగ్గించి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.