Rashmika Mandanna : సమంతకు సపోర్ట్ చేసిన రష్మికా మందన్న.. ఇద్దరు ఒకలాంటి వాళ్లే అంటూ నెటిజన్స్ ట్రోల్స్
Rashmika Mandanna : అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడు చేసే ట్వీట్స్ చర్చనీయాశంగా మారుతున్నాయి. సమంత-నాగ చైతన్య విడాకుల తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. సమంత ఫ్యాన్స్ నాగ చైతన్యను తప్పుబడితే, చైతూ ఫ్యాన్స్ సమంతను ఆడిపోసుకున్నారు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలదే తప్పున్నట్లు చూసే సమాజం సమంతను టార్గెట్ చేసింది. సోషల్ మీడియా అకౌంట్స్ లో పరోక్షంగా నాగ చైతన్యను టార్గెట్ చేస్తూ కొందరు పోస్ట్స్ పెట్టేవారు. ఆమె కొటేషన్స్, లైన్స్ నాగ చైతన్య తనకు ఏదో అన్యాయం చేశాడన్నట్లు ఉండేవి.
డైరెక్ట్ గా ఎటువంటి ఆరోపణలు చేయని సమంత ఇన్ డైరెక్ట్ గా నాగ చైతన్యను ఉద్దేశిస్తూ విమర్శలు చేసేవారు. సమంత పోస్ట్స్ కి చైతూ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూ ఉండేవారు.సమంత ఇటీవల ట్వీట్ చేయగా, అందులో ‘నా మౌనం అజ్ఞానం అని, నా సైలెన్స్ అన్నిటికి అంగీకరిస్తున్నానని, నా దయని బలహీనత అని అనుకోకండి. దయాగుణానికి కూడా ఓ చివరి డేట్ ఉంటుంది. జస్ట్ చెప్తున్నాను అంతే’ అంటూ కాస్త సీరియస్ గానే ట్వీట్ చేసింది. ఇప్పుడు సమంత చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది అని తలలు పట్టుకుంటున్నారు. మళ్ళీ ఎవరైనా సమంతని ట్రోల్ చేశారా?

Rashmika Mandanna in supported Samantha trolled by netigens
లేక సమంతని ఎవరైనా ఏమన్నా అన్నారా అని ఆరా తీసారు నెటిజన్లు.అయితే సమంత ట్వీట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన నటించింది. పవర్ వర్డ్స్ అన్న అర్థం వచ్చేలా ‘Wordఅని రాశి పక్కన పవర్ ఎమోజీని రష్మిక ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు రష్మిక ట్వీట్ వైరల్ అవుతోంది. దీంతో సమంత్ ఫ్యాన్స్ అంతా రష్మికకు థాంక్స్ చెబుతున్నారు. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్.. పాపం చైతును రక్షిత్‌ను పిచ్చోళ్లను చేశారుగా.. ఇలానే ముచ్చట్లు చెబుతారు వినేవాళ్లుంటే’ అంటూ ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.