Shiva Jyothi : శివజ్యోతిని బెల్డుతో తంతోన్న భర్త.. రవికృష్ణ కామెంట్స్ వైరల్
Shiva Jyothi : శివజ్యోతి బిగ్ బాస్ షో వల్ల కలిసిన కొన్ని బంధాలు ఎప్పటికీ అలా కొనసాగుతూనే ఉంటాయి. బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్ల కంటే ఒక్కోవారి వారి బంధువులు, భర్త, భార్య ఇలా పక్క వారు ఫేమస్ అవుతుంటారు. ఈ క్రమంలో మూడో సీజన్‌లో పునర్నవి తమ్ముడు, శ్రీముఖి ఫ్యామిలీ, శివజ్యోతి భర్త, రవికృష్ణ మామయ్యా, రాహుల్ తల్లి, అలి రెజా భార్య ఇలా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. ఇందులో ఎప్పుడూ కూడా ట్రెండింగ్‌లో ఉండేది మాత్రం శివజ్యోతి భర్త గంగూలి.

Ravi krishna about Shiva Jyothi and Ganguly Manthri
శివజ్యోతి, రవికృష్ణ, హిమజ కలిసి చేసే అల్లరిలో గంగూలి కూడా ఉంటాడు. ఏ పార్టీ చేసుకున్నా సరే అతను కూడా వారితో పాటే ఉంటాడు. ఇక ఒకే ఇంటి సభ్యుల్లా ఎంతో కలిసిపోయారు. రవికృష్ణకు కరోనా వస్తే కూడా శివజ్యోతి ఇంట్లోనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. అలా సొంతింటి మనుషుల్లా మారిపోయారు. ఈమధ్యే కొత్త కారు కొన్న సందర్భంలో అందరూ కలిసి పార్టీలు కూడా చేసుకున్నారు. తాజాగా శివజ్యోతిపై రవికృష్ణ వెరైటీ కామెంట్లు చేశాడు.

Ravi krishna about Shiva Jyothi and Ganguly Manthri
ఎప్పుడూ కూడా అక్కా అక్కా అంటూ తిరిగే రవికృష్ణ ఈ సారి మాత్రం ప్లేటు ఫిరాయించాడు. శివజ్యోతిని తన భర్త గంగూలి బెల్టుతో కొడుతూ ఉంటే ఇంకా నాలుగు కొట్టు బావ అంటూ రెచ్చగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. భార్యను కొడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. దాని కంటే కూడా రవికృష్ణ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.