Ravi Teja : మల్టీస్టారర్స్‌కు రవితేజ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ సిగ్నల్స్..లాజిక్ ముందే తెలుసుకున్నాడా..?
Ravi Teja : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మళ్ళీ అలా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో రవితేజ. దర్శకత్వ విభాగంలో కొంత కాలం పనిచేసి ఆ తర్వాత నీకోసం సినిమాతో హీరోగా మారిన రవితేజ మాస్ చిత్రా లలో హిట్స్ అందుకొని..తన మాస్ మ్యానరిజంతో మాస్ మహారాజగా క్రేజ్ సంపాదిం చుకున్నాడు. అయితే, ఇటీవల ఈ మాస్ రాజ బ్యాక్ టు బ్యాక్ మల్టీస్టారర్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అప్పటి తరంలో ఇలా మల్టీస్టారర్స్ ట్రెండ్ బాగా నడిచేది. స్టార్ హీరోలందరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నా రు.
ఇక బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ మల్టీస్టారర్ చిత్రాలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. కానీ, మన తెలుగులో కొన్నేళ్ళు ఇలా మల్టీస్టారర్ సినిమాలు రావడం తగ్గిపోయింది. మళ్ళీ గత ఏడెనిమిదేళ్ళుగా ఇక్కడ ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. మరీ ముఖ్యంగా తెలుగులో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల చిత్రాల తర్వాత వరుసగా మల్టీస్టారర్ సినిమాలలో పెద్ద హీరోలే నటించడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ రెండు ప్రధానమైన కారణాలు. మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వస్తే గనక ఎక్కువగా హీరో అవకాశాలు రాకపోయినా కూడా ఈ అవకాశాలు దక్కుతుంటాయి.
Ravi Teja : మల్టీస్టారర్ సినిమా అంటే జనాలలో ఇప్పుడు ప్రత్యేకమైన ఆదరణ..
ఇక మరొక రీజన్..ఏజ్ ఎక్కువయ్యాక హీరో వేశాలే వెయ్యాలంటే చూసేందుకు జనాలు ఆసక్తి చూపించరు. కాబట్టి ఇప్పటి నుంచే జగపతి బాబులా విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల మీద ఫోకస్ పెడుతున్నారు. దీనివల్ల అవకాశాలు వచ్చేందుకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. సినిమా లు చేయడం లేదనే భావన అస్సలుండదు. పైగా మల్టీస్టారర్ సినిమా అంటే జనాల లో ఇప్పుడు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. ఈ లాజిక్కులన్నీ రవితేజ బాగా పట్టేస్నట్టున్నాడు. అందుకే, మెగా 154లో చిరంజీవితో కలిసి, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే, మరో తమిళ రీమేక్ సినిమాలో కూడా నటించేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది.