Ravi Teja : రవితేజ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న లిప్ లాక్ సెంటిమెంట్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravi Teja : రవితేజ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న లిప్ లాక్ సెంటిమెంట్..?

 Authored By govind | The Telugu News | Updated on :10 May 2022,4:30 pm

Ravi Teja : మాస్ మహారాజ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతుంది లిప్ లాక్ సెంటిమెంట్..? అంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. కొందరు హీరో హీరోయిన్స్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ తమ సినిమాల సక్సెస్‌కు ఓ సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అందుకు ఉదాహరణ సమంత – నాగ చైతన్యలే. వీరిద్దరు గనక సినిమాలో ఓ లిప్ లాక్ ఇచ్చుకుంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని సమంతనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.అయితే, కొన్ని కాంబినేషన్స్ అంటే అభిమానుల్లో ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలుండవు. అంతేకాదు, కొన్ని సీన్స్ పరంగా ఓ నెగిటివ్ టాక్, బ్యాడ్ సెంటిమెంట్ అని కామెంట్స్ వస్తుంటాయి.

ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ విషయంలో ఇలాంటి టాక్ వినిపిస్తోంది. రవితేజ హీరోయిన్స్‌తో లిప్ లాక్ ఇస్తే ఆ సినిమా ఫ్లాపనే సెంటిమెంట్ ఒకటుంది. దీనికి ఎగ్జాంపుల్స్‌గా కూడా కొన్ని సినిమాలున్నాయి. కిక్ బ్లాక్ బస్టర్. ఆ సినిమాకు సీక్వెల్‌గా కిక్ 2 వచ్చింది. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌సింగ్ నటించింది. కిక్ 2లో రవితేజ – రకుల్‌ల మధ్య ఓ లిప్ లాక్ ఉంది. ఈ సినిమా సక్సెస్ గురించి అందరికీ తెలిసిందే. ఇక గత చిత్రం ఖిలాడిసినిమాలో కూడా ఉద్దరు హీరోయిన్స్‌తో రవితేజ పెదవి కలిపాడు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద తిరగబడింది. దాంతో రానున్న సినిమాలలో రవితేజ -హీరోయిన్స్ మధ్య ఎలాంటి లిప్ లాక్ ఉండకుండా బావుండు అని మాట్లాడుకుంటున్నారట.

Ravi Teja fans under tension Lip lock sentiment

Ravi Teja fans under tension Lip lock sentiment

Ravi Teja : ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు..

దీనికి కారణం తాజాగా రామారావు ఆన్‌డ్యూటీ సినిమా నుంచి ఓ సాంగ్ వచ్చింది. ఇందులో హీరోయిన్స్‌గా మజిలీ ఫేం దివ్యాంశ కౌషిక్, రజీషా విజయన్ నటించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజై ఆకట్టుకుంటుంది. దీనిలో దివ్యాంశ – రవితేజల మధ్య లిప్ లాక్ ఉనట్టు సాంగ్‌లో విజువల్స్
చూస్తే క్లారిటీ వచ్చింది. దాంతో రామారావు కూడా ఫ్లాప్ సినిమాలలో చేరుతాడా..? అని మాస్ మహారాజ అభిమానులు టెన్షన్ పడుతున్నారట. కానీ, ఇక్కడ చాలామంది గమనించాల్సింది కూడా ఒకటుంది. పవర్ సినిమాలో హీరోయిన్ రెజీనా కసాండ్రతో మంచి లిప్ కిస్ ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. కాబట్టి అంత నెగిటివ్‌గా రామారావు ఆన్‌డ్యూటీ సినిమా గురించి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది