Navya Swamy Fires on Ravikrishna on Asking Hug to Shraddha Das in Dhee Promo
Dhee Show : బుల్లితెరపై రవికృష్ణ నవ్యస్వామికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ జంట పక్షుల్లా కనిపిస్తుంటారు. ఏ షోకు వెళ్లినా, ఈవెంట్‌కి వెళ్లినా కూడా రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు. నిజమైన ప్రేమ జంటలా తెరపై బాగానే నటిస్తుంటారు. ఇక ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతోంటారు. అయితే ఈ జోడి ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. మామూలుగా అయితే పండుగ ఈవెంట్లతో నవ్యస్వామి, రవికృష్ణ కనిపిస్తు సందడి చేస్తుంటారు. ఢీ షోలోకి ఈ ఇద్దరినీ తీసుకున్నారు. ఢీ షోలో ముందు నుంచి ఆది, ప్రదీప్, రష్మీ, సుధీర్ ఉన్నంత వరకు బాగానే నడిచింది.
మధ్యలో వర్షిణి కూడా వచ్చింది. ఆ తరువాత వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ కొత్త సీజన్‌లో రెండు జంటలు వచ్చాయి. అఖిల్, రవికృష్ణ, నవ్య కృష్ణ ఇలా అందరూ వచ్చారు. అఖిల్ సార్థక్‌ని అయితే దారుణంగా ఏడిపించేశారు. హైపర్ ఆది తన పంచులతో అఖిల్‌ను ఆడుకున్నాడు. ఇక అఖిల్.. బిగ్ బాస్ ఓటీటీలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత అఖిల్ ప్లేస్‌లో ఇంకెవ్వరూ రాలేదు. అయితే నవ్యస్వామి, రవికృష్ణలు ఇద్దరికీ ఢీ షో అంతగా ఉపయోగపడలేదు. ఈ ఇద్దరూ ఢీ షోలో అంతగా పర్పామెన్స్ ఏమీ ఇవ్వలేదు. ఆది మాత్రమే వారిద్దరి మీద పంచులు వేసేవాడు.
Ravikrishna And Navya Swamy Out From Dhee Show
మధ్య మధ్యలో నవ్యస్వామిని గెలికేవాడు. ఇక రవికృష్ణ నవ్యస్వామి జోడి మీద కూడా కౌంటర్లు వేసేవాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా ఢీ షోలో కనిపించలేదు. తాజాగా రిలీజ్ చూసిన ప్రోమోలో ఈ ఇద్దరూ కనిపించలేదు. వారికి బదులుగా ఇంకో కొత్త జోడి వచ్చింది. యూట్యూబర్ నిఖిల్ తన గర్ల్ ఫ్రెండ్‌ని పట్టుకొచ్చాడు. రష్యాలో చదివినప్పుడు పరిచయమైందని చెబుతూ ఓ పిల్లను పట్టుకొచ్చాడు. మొత్తానికి నవ్యస్వామి, రవికృష్ణలు మాత్రం ఢీ నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరూ తమంతట తామే తప్పుకున్నారా? లేదా ఢీ డైరెక్షన్ టీం తప్పించిందా? అన్నది తెలియడం లేదు.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.