Dhee Show : ఢీ షోలో కనిపించని రొమాంటిక్ జోడి.. నవ్యస్వామి రవికృష్ణకు ఏమైంది? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Dhee Show : ఢీ షోలో కనిపించని రొమాంటిక్ జోడి.. నవ్యస్వామి రవికృష్ణకు ఏమైంది?

Dhee Show : బుల్లితెరపై రవికృష్ణ నవ్యస్వామికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ జంట పక్షుల్లా కనిపిస్తుంటారు. ఏ షోకు వెళ్లినా, ఈవెంట్‌కి వెళ్లినా కూడా రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు. నిజమైన ప్రేమ జంటలా తెరపై బాగానే నటిస్తుంటారు. ఇక ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతోంటారు. అయితే ఈ జోడి ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. మామూలుగా అయితే పండుగ ఈవెంట్లతో నవ్యస్వామి, రవికృష్ణ కనిపిస్తు సందడి చేస్తుంటారు. ఢీ షోలోకి ఈ ఇద్దరినీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 June 2022,7:30 pm

Dhee Show : బుల్లితెరపై రవికృష్ణ నవ్యస్వామికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ జంట పక్షుల్లా కనిపిస్తుంటారు. ఏ షోకు వెళ్లినా, ఈవెంట్‌కి వెళ్లినా కూడా రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు. నిజమైన ప్రేమ జంటలా తెరపై బాగానే నటిస్తుంటారు. ఇక ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతోంటారు. అయితే ఈ జోడి ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. మామూలుగా అయితే పండుగ ఈవెంట్లతో నవ్యస్వామి, రవికృష్ణ కనిపిస్తు సందడి చేస్తుంటారు. ఢీ షోలోకి ఈ ఇద్దరినీ తీసుకున్నారు. ఢీ షోలో ముందు నుంచి ఆది, ప్రదీప్, రష్మీ, సుధీర్ ఉన్నంత వరకు బాగానే నడిచింది.

మధ్యలో వర్షిణి కూడా వచ్చింది. ఆ తరువాత వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ కొత్త సీజన్‌లో రెండు జంటలు వచ్చాయి. అఖిల్, రవికృష్ణ, నవ్య కృష్ణ ఇలా అందరూ వచ్చారు. అఖిల్ సార్థక్‌ని అయితే దారుణంగా ఏడిపించేశారు. హైపర్ ఆది తన పంచులతో అఖిల్‌ను ఆడుకున్నాడు. ఇక అఖిల్.. బిగ్ బాస్ ఓటీటీలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత అఖిల్ ప్లేస్‌లో ఇంకెవ్వరూ రాలేదు. అయితే నవ్యస్వామి, రవికృష్ణలు ఇద్దరికీ ఢీ షో అంతగా ఉపయోగపడలేదు. ఈ ఇద్దరూ ఢీ షోలో అంతగా పర్పామెన్స్ ఏమీ ఇవ్వలేదు. ఆది మాత్రమే వారిద్దరి మీద పంచులు వేసేవాడు.

Ravikrishna And Navya Swamy Out From Dhee Show

Ravikrishna And Navya Swamy Out From Dhee Show

మధ్య మధ్యలో నవ్యస్వామిని గెలికేవాడు. ఇక రవికృష్ణ నవ్యస్వామి జోడి మీద కూడా కౌంటర్లు వేసేవాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా ఢీ షోలో కనిపించలేదు. తాజాగా రిలీజ్ చూసిన ప్రోమోలో ఈ ఇద్దరూ కనిపించలేదు. వారికి బదులుగా ఇంకో కొత్త జోడి వచ్చింది. యూట్యూబర్ నిఖిల్ తన గర్ల్ ఫ్రెండ్‌ని పట్టుకొచ్చాడు. రష్యాలో చదివినప్పుడు పరిచయమైందని చెబుతూ ఓ పిల్లను పట్టుకొచ్చాడు. మొత్తానికి నవ్యస్వామి, రవికృష్ణలు మాత్రం ఢీ నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరూ తమంతట తామే తప్పుకున్నారా? లేదా ఢీ డైరెక్షన్ టీం తప్పించిందా? అన్నది తెలియడం లేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది