Raviteja : నాకు ఎవ్వడి సపోర్ట్ లేకపోవచ్చు.. కానీ నాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. ఏడ్చేసిన రవితేజ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raviteja : నాకు ఎవ్వడి సపోర్ట్ లేకపోవచ్చు.. కానీ నాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. ఏడ్చేసిన రవితేజ

 Authored By kranthi | The Telugu News | Updated on :22 October 2023,4:00 pm

Raviteja : దసరా కానుకగా మాస్ మహారాజ్ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రవితేజ చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే.. అంతకుముందు తీసిన రావణాసుర సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈసారి ఎంతో కసిగా రవితజ ఈ సినిమా తీశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో రవితేజ ఎమోషనల్ గా మాట్లాడాడు. పర్సనల్ గా కానీ.. ప్రొఫెషనల్ గా కానీ.. ఇలాంటి పాజిటివ్ వాళ్లు పక్కన ఉంటే బాగుంటుంది అని రవితేజ తన సినిమాకు పనిచేసిన వాళ్లతో అన్నాడు రవితేజ. ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ కు థాంక్స్ చెప్పారు. లిరిక్ రైటర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు పని చేసిన ఫైటర్స్ కు, డైలాగ్ రైటర్ కు ధన్యవాదాలు తెలిపారు.

సినిమా చూసి నన్ను మెచ్చుకున్న వాళ్లకు చాలా ధన్యవాదాలు. ఆడియెన్స్, అభిమానులు, వెల్ విషర్స్ సినిమా బాగుందని మెచ్చుకున్నారు. మా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మయాంక్ కూడా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. యారీ క్యారెక్టర్ మంచిగా వచ్చింది. యారీ క్యారెక్టర్ లో బాగా ఒదిగిపోయారు. వంశీ చెప్పినట్టు కొత్త వాళ్లతో చేస్తేనే ఎఫెక్ట్ ఉంటుంది. కొత్త వాళ్లతో చేయించడం అనేది గొప్ప విషయం. అది తక్కువ మందికి సాధ్యం అవుతుంది. జీవీ ప్రకాష్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. మా డైరెక్టర్ వంశీ.. ఇంతకుముందు రెండు సినిమాలు ప్రాక్టీస్ మ్యాచ్ ల లాంటివి అన్నారు రవితేజ.

raviteja emotional speech at tiger nageswara rao success meet

Raviteja : ప్రతి ఆర్టిస్టులో ఎలా కావాలంటే అలా నటింపజేశాడు డైరెక్టర్

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు కాదు. క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తారు. అలా రావడానికి కారణం డైరెక్టర్ వంశీ. ఆయన్నుంచి నేను ఇంత ఊహించలేదు. వంశీ నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. నీకు అంత కెపాసిటీ ఉంది. నీకు అభినందనలు. మనం ఇంకా ట్రావెల్ చేయాలి.. అంటూ రవితేజ తెగ మెచ్చుకున్నారు. విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ తర్వాత నాకు విపరీతంగా నచ్చిన క్యారెక్టర్ టైగర్ నాగేశ్వరరావు.. అంటూ రవితేజ మెచ్చుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది