Liger : లైగర్ లో రియల్ బాక్సర్ .. పూరి ప్లాన్ ఎప్పటికి వర్కౌట్ అవుతుందో ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Liger : లైగర్ లో రియల్ బాక్సర్ .. పూరి ప్లాన్ ఎప్పటికి వర్కౌట్ అవుతుందో ..?

 Authored By govind | The Telugu News | Updated on :15 February 2021,10:33 am

Liger : లైగర్ .. టాలీవుడ్ రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. సాలా క్రాస్ బ్రీడ్ అన్న వెరైటీ ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కంప్లీట్ గా డైరెక్టర్ పూరి జగన్నాధ్ మార్క్ సినిమాగా తయారవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తోంది. 120 కోట్ల భారి బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా లైగర్ తెరకెక్కుతోంది. లాక్ డౌన్ కి ముందు 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయినా ఈ సినిమా షూటింగ్ ని తిరిగి మొదలు పెట్టడానికి పూరి టీం ముంబై చేరుకుంది.

real boxer in puris liger is his plan worksout

real-boxer-in-puris-liger-is-his-plan-worksout

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నాడు. చాలా పవర్ ఫుల్ రోల్ లో విజయ్ దేవరకొండ ని చూపిస్తున్నాడు పూరి జగన్నాధ్. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి ధీటుగా ఉండే రియల్ బాక్సర్ ని వెతుకుతున్నట్టు తాజా సమాచారం. పైగా కాస్త యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ట్రై చేస్తున్నారట పూరి టీం. మరి నిజంగా రియల్ బాక్సర్ ని తీసుకు రావడం అంటే కాస్త కష్టమే. కాని పూరి టీం కి ఇది పెద్ద సమస్య అయితే కాదు. చూడాలి మరి ఈ సినిమాలో ఛాన్స్ అందుకునే ఆ రియల్ బాక్సర్ ఎవరో. ఇక రెండు రోజుల క్రితమే విజయ్ దేవరకొండ ముంబై చేరుకున్నాడు.

Liger : లైగర్ ని పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తుండటం తో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఈ రోజు నుంచి ముంబై లో లైగర్ షూటింగ్ మొదలైందని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి ఏకంగా విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియన్ సినిమాగా లైగర్ ని రూపొందిస్తుండటం తో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైగర్ రిలీజ్ కాబోతోంది. పూరి – ఛార్మి నిర్మాతలుగా.. కరణ్ జోహార్ సమర్పకుడిగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది