Anasuya : పిల్లల కారణంగా అనసూయ జబర్దస్త్ మానేసిందనే వాదన నిజమేనా..?
Anasuya : జబర్దస్త్ కామెడీ షో ద్వారా హీరోయిన్ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ ఈ మధ్య కాలంలో ఆ కార్యక్రమాన్ని వదిలేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్ వదిలేయడానికి ప్రధాన కారణం సినిమాల్లో వరసగా ఆఫర్స్ రావడమే అంటూ చివరి ఎపిసోడ్ లో అనసూయ చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. వారంలో ఒక్క రోజు కేటాయించలేక పోతున్నాను అంటూ ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసింది. ఆమె సినిమాల్లో ఆఫర్స్ కారణంగానే మానేసిందా లేదంటే మరి ఏదైనా కారణం ఉందా అంటూ రకరకాలుగా ఆమె అభిమానులు ఊహల్లో మునిగి తేలుతున్నారు.
మొదట ఆమె స్టార్ మా నుండి బిగ్ ఆఫర్ రావడం వల్లే మానేసిందని ప్రచారం జరిగింది. కానీ అక్కడ పెద్దగా కార్యక్రమాలు చేస్తున్న దాఖలాలు లేవు. దాంతో స్టార్ మా వల్ల ఆమె మానేయలేదని వెళ్లడైంది. ఇక తాజాగా ఆమె పిల్లలు పెద్ద వారు అవుతున్న కారణంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసిందంటూ ప్రచారం జరుగుతుంది. అనసూయకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులు కూడా పెద్ద వారు అవుతున్న కారణంగా వారు జబర్దస్త్ కార్యక్రమాన్ని చూడడం.. తన గురించి ప్రేక్షకులు మరియు సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకోవడం బాగోదు అనే ఉద్దేశంతోనే అనసూయ
మెల్ల మెల్లగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే అనసూయను అభినందించాల్సిందే. కొడుకులు పెద్ద వారవుతున్న ఈ సమయంలో వారి ముందు చులకన అవ్వకుండా వారికి బాధను కలిగించకుండా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేయడం అభినందనీయం అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేయడానికి అసలు కారణం ఏంటి అనేది అధికారికంగా తెలియదు. కానీ ఇలాంటి పుకార్లు రకరకాలుగా షికారులు అయితే చేస్తున్నాయి.