Prabhas : ప్రభాస్ పెళ్లి అతనే చెడగొడుతున్నాడా.. ఆవేదన చెందుతున్న తల్లి
Prabhas : బాహుబలి సినిమితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. ఈయన గురించి ఏ విషయం బయటకు వచ్చిన అది నెట్టింట తెగ హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయంపై అనేక వార్తలు హల్‌చల్ చేస్తుంటాయి. దశాబ్దకాలంగా ప్రభాస్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. ఈ పదేళ్ల కాలంలో వందల కొద్ది పుకార్లు పుట్టుకొచ్చాయి. పరిశ్రమతో సంబందం లేని అమ్మాయిలతో పాటు కొందరు హీరోయిన్స్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ప్రముఖంగా అనుష్క శెట్టితో పెళ్లి అంటూ తెగ ప్రచారం నడిచేది త్వరలో వివాహం చేసుకోనున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇద్దరూ కలిసి నాలుగు చిత్రాలు చేయడంతో పాటు సింగిల్ స్టేటస్ కావడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది.
Prabhas : పెళ్లిపై రూమర్స్..
తాజాగా ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఓ వ్యక్తి అంటూ ప్రభాస్ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇలా ప్రభాస్ కి చిన్నప్పటినుంచి ఎంతో మంచి స్నేహితుడు అయిన రవి కారణంగానే ప్రభాస్ ఇలా తయారయ్యారని ప్రభాస్ తల్లి ఆ విషయాన్ని వెల్లడిస్తూ బాధపడినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా తన స్నేహితుడు రవిని మాత్రం వదిలిపెట్టడని ప్రతిరోజు తనతో మాట్లాడుతూ ఉంటారని ప్రభాస్ అమ్మ తన సన్నిహితుల దగ్గర చర్చించినట్టు తెలుస్తోంది. రవి వ్యక్తిగత జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమించి ఫెయిల్యూర్ అయ్యారని అందువల్లనే ప్రభాస్ కూడా పెళ్లి గురించి ఆలోచించకుండా ఇలా తయారయ్యారంటూ ప్రభాస్ సన్నిహితుల దగ్గర ఆయన తల్లి బాధపడినట్లు వార్తలు వస్తున్నాయి
రవి నిత్యం తన లవ్ ఫెయిల్యూర్ గురించి బాధపడుతూ పెళ్లంటే భయపడేలా చెప్పడం వల్లే ప్రభాస్ కూడా పెళ్లి గురించి ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సలార్, ప్రాజెక్ట్ కే చిత్రీకరణ దశలో ఉండగా… ఆదిపురుష్ డబ్బింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ విడుదల కానున్నాయి. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ మూవీ, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రం ప్రభాస్ ప్రకటించారు. వచ్చే నాలుగైదేళ్ళ ఆయన చాలా బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఆయన పెళ్ళికి సమయం కేటాయిస్తారా లేదా అనేది చూడాలి.