Ram charan : రామ్ చరణ్ బాలీవుడ్ లో ఘోర అవమానం… ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత కథ వేరే ఉంటది..!
Ram charan : టాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోలు బాలీవుడ్ బాట పట్టి… తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రానా నుంచి ప్రభాస్, హర్ష వర్ధన్ రానే ఇప్పటికే అక్కడ తమ సత్తా చాటుతుండగా… తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి మొదలుకొని సత్యదేవ్ వరకు హిందీలో అడుగు పెడుతున్నారు. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోల్లో సక్సెస్ అయిన వారు అతి తక్కువ గానే ఉన్నారని చెప్పుకోవాలి. చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు చాలా మంది హీరోలు ఒకటి, రెండు సినిమాలతోనే సర్ధేసుకున్నారు.
ముఖ్యంగా రామ్ చరణ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జంజీర్ మూవీతో ఆయన అక్కడ దారుణమైన అవమానాలను ఎదుర్కొన్నారు.బాలీవుడ్ లో రామ్ చరణ్ నటించిన జంజీర్ సినిమా తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వగా…. చిత్రానికి అక్కడి సినిమా క్రిటిక్స్ 1… 1.5 రేటింగ్స్ ఇచ్చి ఘోరంగా ఏకి పారేశారు. అంతటితో ఆగకుండా ఆ ఏడాది అత్యంత ఉత్తమమైన చెత్త సినిమాగా జంజీర్ ను పేర్కొనడం చిత్ర బృందంతో పాటు హీరోగా రామ్ చరణ్ కు తీరని అవమానంగా మారింది. అప్పటినుండి రామ్ చరణ్ మళ్ళీ బాలీవుడ్ వైపునకు అడుగు వేయలేదు.

reason behind Ram charan not attended pre release events of rrr in mumbai news going viral in social media
Ram charan : రామ్ చరణ్ కి దారుణ అవమానం..:
అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఇక్కడ చర్చకు వచ్చిందంటే… ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఇవెంట్లలో బాలీవుడ్ వేదికలపై చరణ్ కనిపించక పోవడమే ఇందుకు కారణం. ఒకప్పుడు జరిగిన అవమానంతో జనవరి 7 తర్వాతే తాను నటనతో ప్రూవ్ చేసుకున్న అనంతరమే ముంబై లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో చెర్రీ… అల్లూరి సీతారామరాజుగా దుమ్ము దులిపేశాడు. ఇక సినిమాతో ఒకప్పటి విమర్శకుల నోళ్లు మూయించడం ఖాయమని ఆయన అభిమానులు గళ్ళా ఎగిరేసి మరి చెబుతున్నారు.