Renu Desai : జనాలకు అది అర్థం కావడం లేదు.. రేణూ దేశాయ్ ఆవేదన ఇదే

Authored By aruna | The Telugu News | Published on: August 14, 2023, 12:00 pm

Renu Desai : రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఆమె వేసే పోస్టులు ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గురించి పెట్టిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతూ షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పవన్ కళ్యాణ్ మంచివారని, ఆయనలాంటి వారు అరుదుగా ఉంటారని రేణూ దేశాయ్ చెప్పిన మాటలు ఒక్కసారిగా నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ తన విషయంలో చేసింది తప్పేనని, ఆ మాట నేను అప్పుడూ అన్నాను.. ఇప్పుడూ అంటాను.. కానీ ఆయన పర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టండి.. నేను ఆయనతో ఎన్నో ఏళ్లు కాపురం చేశాను.. నాకు ఆయన గురించి తెలుసు.. ఆయన డబ్బు మనిషి కాదు.. సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు.. డబ్బే కావాలనుకుంటే ఆయన సినిమాల్లో నటించే సంపాదించుకునేవాడు.. ఆయనకి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ రేణూ దేశాయ్ చెప్పిన మాటలు అందరినీ షాక్‌కు గురి చేశాయి.

Renu Desai About Animal and Vegan Meat

Renu Desai About Animal and Vegan Meat

అలా అందరినీ షాక్‌కు గురి చేసిన రేణూ దేశాయ్.. తాజాగా మరో పోస్ట్ వేసింది. రేణూ దేశాయ్ వేగాన్‌గా మారిన సంగతి తెలిసిందే. వేగన్ అంటే కనీసం పాలు, పాల ఉత్పత్తులు కూడా వాడరు. పూర్తిగా శాకాహారాన్ని తీసుకుంటారు. జంతు హింస, మాంసానికి దూరంగా ఉంటారు. మనం తినే జంతువులకు కూడా ఫ్యామిలీ ఉంటుందని, వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయని మనుషులకు ఎందుకు అర్థం కావడం లేదు.. అంటూ ఓ వీడియోను రేణూ దేశాయ్ షేర్ చేసింది. తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తోంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp