రేణూ దేశాయ్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. గోవా బీచ్‌లో సేద తీరుతూ రచ్చ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

రేణూ దేశాయ్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. గోవా బీచ్‌లో సేద తీరుతూ రచ్చ!

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్ షేర్ చేసే పోస్ట్‌లు, ఫోటోలు ఫుల్ వైరల్ అవుతుంటాయి. సమాజంలోని అసమానతలు, మహిళలపై జరిగా అఘాయిత్యాలు ఇలా అన్నింటిపై స్పందిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రకృతి ప్రేమికురాలిగా ఆమె చేసే పోస్ట్‌లు, చెప్పే కవిత్వాలు, షేర్ చేసే ఫోటోలు మరింతగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు రేణూ దేశాయ్ గోవాలో రచ్చ చేస్తోంది. నిహారిక పెళ్లికి వెళ్లకుండా రేణూ దేశాయ్ తన సినిమా […]

 Authored By uday | The Telugu News | Updated on :15 December 2020,10:12 am

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్ షేర్ చేసే పోస్ట్‌లు, ఫోటోలు ఫుల్ వైరల్ అవుతుంటాయి. సమాజంలోని అసమానతలు, మహిళలపై జరిగా అఘాయిత్యాలు ఇలా అన్నింటిపై స్పందిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రకృతి ప్రేమికురాలిగా ఆమె చేసే పోస్ట్‌లు, చెప్పే కవిత్వాలు, షేర్ చేసే ఫోటోలు మరింతగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు రేణూ దేశాయ్ గోవాలో రచ్చ చేస్తోంది.

Renu Desai Enjoy In Goa Beach

Renu Desai Enjoy In Goa Beach

నిహారిక పెళ్లికి వెళ్లకుండా రేణూ దేశాయ్ తన సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపింది. ఆద్య వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో జరిపారు. అటు వైపు రేణూ దేశాయ్ తన షూటింగ్‌లతో బిజీగా ఉండగా.. ఇటు వైపు అకీరా, ఆద్యలు నిహారిక పెళ్లిలో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ కారణంగానే నిహారిక పెళ్లికి వెళ్లలేకపోయానని రేణూ దేశాయ్ వెల్లడించింది. అయితే రేణూ దేశాయ్ ప్రస్తుతం గోవాలో సందడి చేస్తోంది.

Renu Desai Enjoy In Goa Beach

Renu Desai Enjoy In Goa Beach

ప్రస్తుతం రేణూ దేశాయ్, అకీరా, ఆద్యలు గోవాలోనే ఉన్నారు. అయితే సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారా? లేదా వెకేషన్ కోసం వెళ్లారా? అన్నది తెలియడం లేదు. కానీ రేణూ దేశాయ్ మాత్రం దుమ్ములేపుతోందని తెలుస్తోంది. సముద్రంలో దిగి సేదతీరుతూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ ఫోటోలను రేణూ దేశాయ్ షేర్ చేయగా అవి తెగ వైరల్అవుతున్నాయి. పైగా ఆ ఫోటోలకు అకీరా ఇచ్చిన క్యాప్షన్ కూడా వైరల్ అవుతోంది. బిస్కిట్ కావాలంటే రిస్క్ చేయాల్సిందేనట (You have to risk it for the biskit) అని అకీరాచెప్పినట్టు రేణూ దేశాయ్ పేర్కొంది.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది