వీడియో : సిగ్గు పడుతున్న సునీత.. రేణూ దేశాయ్ అలా!

0
Advertisement

ప్రస్తుతం రేణూ దేశాయ్ Renu Desai ,సింగర్ సునీత Sunitha, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ముగ్గురు కూడా డ్రామా జూనియర్స్ షోలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ముగ్గురు కూడా నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో దుమ్ములేపనున్నారు. ఈ ముగ్గురూ కూడా స్టేజ్ మీద డ్యాన్సులు వేయనున్నారు. ఈ షోలోని చిచ్చర పిడుగులు ఈ ముగ్గురు పాత్రలను తీసుకుని ఓ స్కిట్ వేసేశారు.

అందులో సునీత Sunitha, రేణూ దేశాయ్ Renu Desai ఇద్దరూ కూడా ఎస్వీ కృష్ణారెడ్డి ఫోటోను పట్టుకుని అక్కా ఎవరే అతగాడు అనే పాటను ఆలపిస్తున్నట్టున్నారు. ఇక పిల్లలు చేసిన ఇదే స్కిట్‌ను ఒరిజినల్ పాత్రలు చేసేందుకు స్టేజ్ మీదకు వచ్చేశారు. ఇక సునీత సిగ్గుమొగ్గలేస్తుండగా.. అక్కా ఎవరే అతగాడు అంటూ రేణూ దేశాయ్ గొంతు కలిపింది. ఆ కొద్ది సేపటికే కృష్ణారెడ్డి కూడా జాయిన్ అయ్యారు.

Renu Desai Sunitha
Renu Desai Sunitha

ఈ ముగ్గురు కలిసి ఆ పాటకు స్టేజ్ మీదే డ్యాన్స్ వేసేశారు. ఆ తరువాత మీ ఫీలింగ్ ఏంటి అని రవి సునీతను అడిగారు. నేను ఎప్పటికీ రామ్‌నే ప్రేమిస్తుంటాను అని చెప్పేశారు. కృష్ణారెడ్డిని ఎప్పుడూ చూసిన తండ్రిలానే అనిపిస్తారని అన్నారు. నాక్కూడా మొదటి సారి చూసినప్పుడు కూతురు ఫీలింగ్ కలిగిందని సునీత గురించి ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు

Advertisement