Suma Adda : సుమ కొత్త షో ‘సుమ అడ్డ’ కి ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన ఏంటీ..!
Suma Adda : యాంకర్ సుమ బుల్లి తెరపై ఏ కార్యక్రమంతో అలరించినా కూడా సక్సెస్ అవుతుంది అనడంతో సందేహం లేదు. మరోసారి ఆ విషయం నిరూపితం అయింది. యాంకర్ సుమ బుల్లి తెరపై సుమ అడ్డ అనే టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ క్యాష్ కార్యక్రమాన్ని ఆపివేసి సుమ అడ్డ అంటూ టాక్ షో ని తీసుకు రావడం వెనక ఉద్దేశం ఏంటో అంటూ మల్లెమాల వారిపై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు వారి అనుమానాలు తీరాయి. క్యాష్ కార్యక్రమం కంటే కూడా సుమ అడ్డ కార్యక్రమం బాగుంది అంటూ వారే ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల యొక్క చిన్ననాటి విషయాలకు మొదలుకొని ఎన్నో ఎమోషనల్ జర్నీ ల గురించి ఈ కార్యక్రమంలో సుమ చర్చిస్తోంది. ప్రేక్షకులకు టాక్ షో పై ఉన్న ఆసక్తిని క్యాస్ చేసుకునేందుకు మల్లెమాల వారు ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.
అనుకున్నట్లుగానే ఈ షో మంచి సక్సెస్ అయింది. మొదటి ఎపిసోడ్ లో సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం టీం మెంబెర్స్ హాజరైన విషయం తెలిసిందే.. ఆ వెంటనే రెండవ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యాడు. దాంతో రేటింగ్ విపరీతంగా వచ్చింది. ఇక మూడో ఎపిసోడ్ కూడా అదే స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా వచ్చిన ప్రోమో ఎపిసోడ్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.