Suma Adda : అప్పుడు బాయ్‌ఫ్రెండ్‌తో తిర‌గడానికి వెళ్లానంటూ అంద‌రి ముందు ఓపెన్‌గా చెప్పిన యాంక‌ర‌మ్మ‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Suma Adda : అప్పుడు బాయ్‌ఫ్రెండ్‌తో తిర‌గడానికి వెళ్లానంటూ అంద‌రి ముందు ఓపెన్‌గా చెప్పిన యాంక‌ర‌మ్మ‌

Suma Adda : సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డా షో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ షోకి సింగర్స్, న‌టీనటులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు వచ్చి సంద‌డి చేస్తుంటారు. తాజా ఎపిసోడ్ యాంకర్స్ స్పెషల్ కావడంతో నలుగురు లేడీ యాంకర్లు గెస్టులుగా విచ్చేశారు. గాయత్రి భార్గవి, శిల్పా చక్రవర్తి, గీత భగత్, వింధ్య సుమ అడ్డాలో సందడి చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. అందరి పై పంచులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2024,12:30 pm

Suma Adda : సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డా షో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ షోకి సింగర్స్, న‌టీనటులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు వచ్చి సంద‌డి చేస్తుంటారు. తాజా ఎపిసోడ్ యాంకర్స్ స్పెషల్ కావడంతో నలుగురు లేడీ యాంకర్లు గెస్టులుగా విచ్చేశారు. గాయత్రి భార్గవి, శిల్పా చక్రవర్తి, గీత భగత్, వింధ్య సుమ అడ్డాలో సందడి చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. అందరి పై పంచులు వేసే సుమ పై రివర్స్ పంచులు పేలాయి. యాంకర్ వింధ్య, గీత భగత్ ఎంట్రీ ఇవ్వడంతోనే .. ఇద్దరూ బాంబే యాంకర్లు అయిపోయారే ఈ మధ్య అని సుమ అన్నారు. ఇక్కడ మీరు ఏ స్లాట్ వదలడం లేదు కదా .. అందుకే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అంటూ వింధ్య కౌంటర్ ఇచ్చింది.

Suma Adda ఏంటి మ‌రీ ఇంత ఘోరంగా..

ఆ తర్వాత గీతా భగత్ , సుమ కలిసి చిన్న స్కిట్ చేశారు. సుమ హాస్టల్ వార్డెన్ కాగా,స్టూడెంట్ రోల్ చేసింది గీత. ‘ మీ అమ్మా నాన్న నా మీద నమ్మకంతో హాస్టల్ లో ఇక్కడ పెడితే .. నువ్వేమో అంటూ సుమ అంటే .. మీ మీద నమ్మకంతో ఇక్కడ పెట్టలేదు. శంషాబాద్ లో మా సైట్ అమ్మకంతో పెట్టారు. అంత ఫీజు కడుతున్నాం అని గీత పంచులు వేసింది. ఇక శిల్పా చక్రవర్తి అయితే తన బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడు అంటూ క్రేజీ కామెంట్ చేసింది. తన బాయ్‌ ఫ్రెండ్‌తో చేసిన పని అందరి ముందు చెప్పేసి షాక్‌ ఇచ్చింది. అనంతరం యాంకర్ల ముందు పుషప్‌లు తీసే పోటీ పెట్టింది సుమ. ఇక్కడ ఎవడైతే యాభై పుషప్‌లు చేస్తాడో వాడు మగాడ్రా అని చెప్పడంతో ఓ కుర్రాడు వచ్చి ఫాస్ట్ గా పుషప్‌లు తీస్తున్నాడు. అది చూసిన శిల్పా చక్రవర్తి రెచ్చిపోయింది. అతన్ని చూస్తుంటే తన బాయ్‌ ఫ్రెండ్‌ గుర్తొస్తున్నాడని చెప్పింది.

Suma Adda అప్పుడు బాయ్‌ఫ్రెండ్‌తో తిర‌గడానికి వెళ్లానంటూ అంద‌రి ముందు ఓపెన్‌గా చెప్పిన యాంక‌ర‌మ్మ‌

Suma Adda : అప్పుడు బాయ్‌ఫ్రెండ్‌తో తిర‌గడానికి వెళ్లానంటూ అంద‌రి ముందు ఓపెన్‌గా చెప్పిన యాంక‌ర‌మ్మ‌

ఆయన కూడా ఇలానే పుషప్‌లు తీసేవాడట. దీంతో సుమ అందుకుని కౌంటర్‌ వేసింది. పెళ్లైపోతే ఇద్దరు పిల్లలుండేవారు, మళ్లీ బాయ్‌ ఫ్రెండ్‌ గుర్తొస్తున్నాడట అనగా, ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదని కవర్‌ చేసుకుంది. నా బాయ్‌ ఫ్రెండ్ తో అలా తిరగడానికి వెళ్లాను. తిరిగి డాన్స్ చేశాం. ఆ తర్వాత హా.. హూ.. `అంటూ అసలు విషయం బయటపెట్టింది. డబుల్ మీనింగ్‌ అర్థంలో తాము చేసిన పని చెప్పేసింది. దీంతో మిగిలిన యాంకర్లు కూడా దానికి `హా.. హూ..హూ అంటూ రియాక్ట్ కావడం విశేషం. శిల్పా చక్రవర్తి అంత ఓపెన్‌గా, అంత మంది కుర్రాళ్ల ముందు, పైగా షోలో ఇలా బాయ్‌ ఫ్రెండ్‌తో చేసిన పని చెప్పి అందరికి షాకిచ్చింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది