ఆర్జీవీ అంటే పేరు కాదు బ్రాండ్ అంటున్నవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ..?
ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ. ఈ పేరు అంటేనే పెద్ద హాట్ టాపిక్. ఆర్జీవీ ఎప్పుడు కుదురుగా ఉండడు. ఏదో ఒక విషయంలో చెలరేగిపోతుంటాడు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంటాడు. ఆర్జీవీ ని పొగిడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తిట్టుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు. కాని ఆర్జీవీకి కావాల్సింది పొగడ్తలు.. తిట్లు కాదు… వాటితో వచ్చే ఫ్రీ పబ్లిసిటీ. ఒక సినిమాని ప్రమోట్ చేయడం లో ఆర్జీవీ స్ట్రాటజీ ఎంటో ఈపాటికే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఒకే ఒక్క ట్వీట్ తో అల్ల కల్లోలం చేసేస్తాడు.
సామాన్యులను కూడా సెలబ్రిటీస్ ని చేసేస్తాడు. ఆర్జీవీ వల్ల ఈ రోజూ సినిమా ఇండస్ట్రీలో సెటిలైన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అంటే లెక్క చెప్పడం చాలా కష్టం. ఏవో రెండు చిన్న సినిమాలు చేసి కూడా ఎవరికీ తెలియని అంకితా మహారాణ ని ఓవర్ నైట్ అప్సర రాణి ని చేసేశాడు. ఈ బ్యూటి ఇప్పుడు రవితేజ క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరవబోతోంది. యూట్యూబ్ యాంకర్ అరియానా అంతక ముందు ఎవరో పెద్దగా తెలియదు.
కాని ఆర్జీవీ ఆ అమ్మాయి మీద చేసిన చిన్న కామెంట్ ఈ రోజు సెలబ్రిటీ రేంజ్ ఫేం తెచ్చుకుంది. ఇవే కాదు చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గతంలో జగపతి బాబు – ఆర్జీవీ కలిసి గాయం అన్న సినిమా చేశారు. అంతక ముందు జగపతి బాబు కి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పగా గాయం నుంచి తన పాత్ర కి తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. తన వాయిస్ ని కామెంట్ చేసిన వాళ్ళే ఇప్పుడు జగపతి బాబు వాయిస్ కి ఫ్యాన్స్ అయ్యారంటే అది ఆర్జీవీ వల్లే.
ఇలాంటి ఉదాహరణ లు ఎన్నో ఉన్నాయి. ఇక ఆర్జీవీ చేసినన్ని ప్రయోగాలు సినిమా ఇండస్ట్రీలో మరే డైరెక్టర్ చేసి ఉండరెమో. ఎంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా మళ్ళీ ఆర్జీవీ నే ఫాలో అవుతుంటారు. చెప్పాలంటే ఆర్జీవీ పేరు కాదు ఒక బ్రాండ్ అన్న దర్శకులు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. టాలీవుడ్ లో ఆర్జీవీ దగ్గర అసోసియేట్స్ గా చేసి ఈ రోజు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా వెలుగుతున్న వాళ్ళలో పూరి జగన్నాధ్, హరీష్ శంకర్, కృష్ణవంశీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ముంబై లో సగానికి పైగా ఆర్జీవీ నుంచి వచ్చిన దర్శకులు.. ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు.