RGV Perni Nani : ఏపీ మంత్రి పేర్ని నానితో రామ్‌గోపాల్ వర్మ ఏం మాట్లాడారో తెలుసా..!
RGV Perni Nani : ఏపీ సినిమా టికెట్ల ధరల వివాదం విషయంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో జరిపిన చర్చ ముగిసింది. రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో… సినిమా టికెట్ల ధరలను పెంచాలనే సినీ ప్రముఖుల డిమాండ్ కు మద్దతుగా వర్మ నేడు మంత్రితో మాట్లాడారు.
అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు ఆర్జీవీ గానీ, ఇటు పేర్ని నాని గానీ ఇంకా మీడియా ముందుకు వచ్చి ఈ అంశంపై స్పందించలేదు. సినిమా టికెట్ ధరలను తగ్గింపు విషయమై ఇటీవల అర్జీవీకి , మంత్రి పేర్ని నానికి మధ్య ట్విట్టర్ వార్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై చర్చిద్దామని వర్మ చేసిన ట్వీట్లపై.. స్పందించిన పేర్ని నాని ఈరోజు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు.

rgv meeting end with ap minister perni nani
ఆర్జీవీ వచ్చీ రావడంతోనే మంచి నాన్ వెజ్ లంచ్ ఏర్పాటు చేసిన నాని.. ఆర్జీవీ తో చర్చలు జరిపారు. మరి వీరిద్దరి సమావేశం ద్వారా ఆర్జీవీ ప్రయత్నాలు ఫలించాయా.. టికెట్ల ధరల తగ్గింపు ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తన మనసు మార్చుకుంటుందా అనేది ఇంకాసేపట్లో తెలియనుంది.