RGV : రేయ్.. పవన్ కళ్యాణ్ 100 కోట్లు తీసుకుంటే నీకెందుకు అంత నొప్పిరా.. ఆర్జీవీ ఫైర్
RGV : ఆర్జీవీ లేదా రామ్ గోపాల్ వర్మ అనే పేరు ఒక పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. ఆర్జీవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే దానిపై ఆయన సినిమా తీశారు. అయితే.. ఈ సినిమాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చూపించారు.
నిజానికి.. ఆర్జీవీ వైఎస్ జగన్ కి అంత వ్యతిరేకి కాదు. వైఎస్ జగన్ అంటే ఆయనకు ఇష్టమే. అందుకే జగన్ ను ఈ సినిమాలో పాజిటివ్ గానే చూపిస్తున్నారు. ఈ సినిమాను ఏపీ ఎన్నికల సందర్భంగానే విడుదల చేస్తుండటంతో కావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నెగెటివ్ గా చూపిస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన సినిమా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
RGV : జగన్ గురించి ఉన్నది ఉన్నట్టుగా చూపించా?
నిజానికి వ్యూహం అనే సినిమా ఏ రాజకీయ పార్టీకి కానీ.. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం కానీ.. తీసింది కాదు. ఆ సినిమా పూర్తిగా నిజం. ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది.. అనే దానిపై నా అభిప్రాయాన్ని నేను చూపించాను. నా అభిప్రాయం మీకు కరెక్ట్ కావచ్చు.. కాకపోవచ్చు కానీ.. నాకు తెలిసింది.. అనిపించింది.. రియాల్టీని నేను సినిమా తీశాను అంటూ చెప్పుకొచ్చారు ఆర్జీవీ. నాకు జగన్ అంటే చాలా ఇష్టం. నాకు నచ్చనిది నేను ఏం చేయను. ఎవరు ఏ సినిమాలో ఎంత పారితోషికం తీసుకుంటే నాకు అవసరం లేదు అంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.