Chiranjeevi : చిరంజీవి బెగ్ చేయ‌డం న‌చ్చ‌లేదు, మీ త‌మ్ముడు మీలా కాదు.. వ‌ర్మ పంచ్‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chiranjeevi : చిరంజీవి బెగ్ చేయ‌డం న‌చ్చ‌లేదు, మీ త‌మ్ముడు మీలా కాదు.. వ‌ర్మ పంచ్‌లు

Chiranjeevi :  సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఛాన్స్ దొర‌కాలే కాని మెగా ఫ్యామిలీ హీరోల‌పై త‌న‌దైన శైలిలో సెటైర్స్ వేస్తూ రెచ్చిపోతుంటాడు. ఆ మ‌ధ్య బ‌న్నీని పైకి లేపిన వ‌ర్మ ప‌వ‌న్‌పై కూడా కొన్ని విమ‌ర్శ‌లు చేశాడు. ఇక ఇప్పుడు ప‌వ‌న్‌ని లేపుతూ చిరంజీవిని త‌గ్గించిన‌ట్టు మాట్లాడాడు. ఇప్పుడు వ‌ర్మ చేసిన కొన్ని ట్వీట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. గురువారం మీటింగ్ తాలూకు వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఆర్జీవీ.. చిరంజీవి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :11 February 2022,12:30 pm

Chiranjeevi :  సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఛాన్స్ దొర‌కాలే కాని మెగా ఫ్యామిలీ హీరోల‌పై త‌న‌దైన శైలిలో సెటైర్స్ వేస్తూ రెచ్చిపోతుంటాడు. ఆ మ‌ధ్య బ‌న్నీని పైకి లేపిన వ‌ర్మ ప‌వ‌న్‌పై కూడా కొన్ని విమ‌ర్శ‌లు చేశాడు. ఇక ఇప్పుడు ప‌వ‌న్‌ని లేపుతూ చిరంజీవిని త‌గ్గించిన‌ట్టు మాట్లాడాడు. ఇప్పుడు వ‌ర్మ చేసిన కొన్ని ట్వీట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. గురువారం మీటింగ్ తాలూకు వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఆర్జీవీ.. చిరంజీవి టార్గెట్‌గా సెటైర్లు గుప్పించారు. ‘ఓ మెగా ఫ్యాన్‌గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధ పడ్డా’ అని ట్వీట్ చేశారు.

ప‌వన్ క‌ళ్యాణ్ ఎప్పుడు అలా ఎగ్ చేయ‌డు. అందుకే అత‌ను పాపుల‌ర్ అంటూ ప‌లు కామెంట్స్ చేశాడు. అయితే చిరంజీవిని ట్యాగ్ చేస్తూ.. ఆయనపై సెటైర్లు వేస్తూ వరస ట్వీట్లు వేసిన వర్మ.. కొద్దిసేపటి తర్వాత తిరిగి వాటని రిమూవ్ చేయడంతో ఆయన తీరుపై జనాల్లో చర్చలు నడుస్తున్నాయి. నిన్న జ‌రిగిన భేటిలో సీఎంతో సమావేశమయ్యే వారి జాబితాలో నాగార్జునతో పాటుగా హీరో జూనియర్ ఎణ్టీఆర్ పేరు ఉంది. కానీ, వీరిద్దరూ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. అక్కినేని అమలకు కరోనా పాజిటివ్‌ రావడంతో నాగార్జున హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే సీఎం వైఎస్‌ జగన్‌తో జరిగే భేటీకి నాగార్జున దూరంగా ఉన్నారు.

rgv satires on chiranjeevi

rgv satires on chiranjeevi

Chiranjeevi  : మెగా బెగ్గింగ్..

ఇక, సీఎంతో చర్చల తరువాత చిరంజీవి… మహేష్ బాబు..ప్రభాస్ అందరూ హర్షం వ్యక్తం చేసారు. అదే సమయంలో సీఎం జగన్ కోరిన విధంగా ఏపీలోనూ సినిమా పరిశ్రమ విస్తరణకు ముందుకొచ్చేందుకు చిరంజీవి సహా హీరోలు సుముఖత వ్యక్తం చేసారు. విశాఖ కేంద్రంగా సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం సైతం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలనుకున్నా అందించటానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు. ఈ నెల మూడో వారంలో ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా హీరోలు చెప్పుకొచ్చారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది