Jabardasth Ritu : ప్రతీ అమ్మాయికి అలాంటోడు ఉండాలట.. రెచ్చిపోయిన జబర్దస్త్ రీతూ
Jabardasth Ritu : జబర్దస్త్ షో పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందో అందరికీ తెలిసిందే. హైపర్ ఆది టీం లేకపోవడంతో దాన్ని పట్టించుకునే వాడు ఎవ్వరూ లేకుండా పోయారు. అసలు ఇప్పుడు జబర్దస్త్ షోను ఎవ్వడూ చూడటం లేదు. గత కొన్ని వారాల నుంచి హైపర్ ఆది ఆ షోలో కనిపించడం లేదు. కారణాలేంటో తెలియడం లేదు గానీ.. ఆది మాత్రం జబర్దస్త్ షోకు దూరంగానే ఉంటున్నాడు.అయితే ఆది లేకపోవడంతో ఓ టీం తక్కువ పడ్డట్టుంది. అందుకే అజర్, రీతూ చౌదరిలను కలిపి ఓ టీంగా పెట్టేశారు.
వాళ్లు ఎంత నాసిరకమైన స్కిట్లు వేస్తున్నారో చూస్తుంటే మల్లెమాల మీద జాలి వేయక తప్పదు. తాజాగా వీరు వేసిన ఓ స్కిట్‌కు తలా తోక లేదంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇందులో రీతూని ప్రొడక్షన్ టీ అమ్మాయిగా, స్వీపర్‌గా చూపించాడు అజర్.అదొక్కటే కాస్త కొత్తగా ఉంది అంతే. రీతూకి ఆ గెటప్ చక్కగా సూట్ అయిందంటూ అజర్ వేసిన పంచ్ పేలింది. ఇక రీతూ ఓవర్ యాక్షన్, అజర్ ఓవర్ యాక్షన్‌తో స్కిట్ అసలు పేలలేదు. అసలు స్కిట్లోనే పస లేకుండా పోయింది.

Ritu Chowdhary About Azar In Jabardasth
అయితే చివర్లో రోజా మాత్రం ఈ జోడిని కావాలనే కదిలించినట్టుంది. నిన్ను టీ తీసుకురా, తుడువు అని అంటే కోపం రాలేదా?అంటూ రీతూని రోజా అడిగింది.నాకు అజర్ అంటే నచ్చదు.. కానీ రెండు నెలల క్రితం అజర్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఇలా నవ్వుతూ ఉన్నాను.. ప్రతీ అమ్మాయి జీవితంలో ఇలాంటి ఓ అబ్బాయి ఉండాలంటూ అజర్ గురించి కాస్త ఎక్కువగా చెప్పేసింది రీతూ. ఆమె అలా అంది కదా? అని అందరి అమ్మాయిల దగ్గరక వెళ్లకు.. రీతూతోనే ఉండు అంటూ అజర్‌కు రోజా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.