Roja : ఢీ అంటే ఢీ.. ఇంద్రజ వర్సెస్ రోజా.. ఇక రచ్చ రచ్చే.. వీడియో!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: August 29, 2021, 9:35 pm

Roja బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతలా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ షోకు నాగబాబు, రోజాలు న్యాయనిర్ణేతలుగా అదిరిపోయారు. మధ్యలో నాగబాబు Naga babu వెళ్లిపోయారు. ఆ తరువాత ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు మనో పర్వాలేదనిపిస్తున్నాడు. మొత్తానికి నాగబాబు రేంజ్‌లో కాకపోయినా కూడా బాగానే మెప్పిస్తున్నాడు. ఇక ఆ మధ్య కొన్ని రోజులు రోజా కూడా గ్యాప్ ఇచ్చింది.

Roja And Indraja In Oorilo Vinayakudu

Roja And Indraja In Oorilo Vinayakudu

రోజా Roja  ఆరోగ్యం బాగా లేకపోవడంతో మధ్యలో వేరే వారితో కానిచ్చారు. సంగీత, ఇంద్రజ అంటూ కొంతమందిని తీసుకొచ్చారు. అందులో ఇంద్రజ బాగానే క్లిక్ అయింది. ఇక రోజా రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా ఇంద్రజే కావాలంటూ నెటిజన్లు కామెంట్లతో దండెత్తారు. అలా జబర్దస్త్ జడ్జ్‌గా రోజా సీటుకే ఎసరు పెట్టే లెవెల్‌లో సెగ తగిలింది. దీంతో ఇంద్రజను శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి తీసుకున్నారు.

 

Roja And Indraja In Oorilo Vinayakudu

Roja And Indraja In Oorilo Vinayakudu

ఢీ అంటే ఢీ.. ఇంద్రజ వర్సెస్ రోజా.. ఇక రచ్చ రచ్చే! Roja

అలా రోజా Roja , ఇంద్రజ Indraja మధ్య కోల్డ్ వార్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరిని వినాయక చవితి ఈవెంట్ ‘ఊరిలో వినాయకుడు’ కోసం తీసుకొచ్చారు. ఈ ఇద్దరిని వేర్వేరు టీంలుగా విడగొట్టారు.

Roja And Indraja In Oorilo Vinayakudu

Roja And Indraja In Oorilo Vinayakudu

లడ్డూ వేలం పాట అంటూ ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేశారు. ఒకరి మీద ఒకరు సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొత్తానికి ప్రోమోలోనే ఇలా ఉంటే.. ఈవెంట్‌‌లో రోజా, ఇంద్రజలు ఎంత రచ్చ చేశారో చూడాలి.

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp