Roja : నలిపేసి ఉంటాడు !.. సుధీర్‌పై రోజా నమ్మకం అదే
Roja : సుడిగాలి సుధీర్‌కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతనికి ఫాన్స్ కూడా ఉన్నారు. షోలో సుధీర్ కనిపిస్తే చాలు వారు పండగ చేసుకుంటారు. కొన్ని షోలలో సుధీర్ లేకపోయినా.. సుధీర్ గురించి కామెంట్స్ చేస్తుంటారు కొందరు నెటిజన్లు. అంటే సుధీర్ క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక, జబర్దస్త్ స్టేజిపైనే కాకుండా, ఢీ, రెచ్చిపోదాం బ్రదర్ షోలలో కూడా సుధీర్ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఇక, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్, సుధీర్‌లు కలిసి చేసే సందడి మాములుగా ఉండదు. షో ఏదైనా.. వీరు ముగ్గురు కలిస్తే వారి ఫ్యాన్స్‌కు పండగే. కంటెంట్ ఏమి లేకపోయినా అక్కడికక్కడే నవ్వులు పూయించగలరు. అయితే సుధీర్ తనపై ఎన్ని రకాల కామెంట్స్ చేసిన లైట్ తీసుకుంటాడు. గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్‌లే కాకుండా మిగతా కమెడీయన్స్ కూడా సుధీర్ మీద పంచులు వేస్తుంటారు. అలా ఎన్ని సెటైర్లు, పంచులు వేసినా కూడా అంతగా పట్టించుకోడు.

Roja Excellent Counter on Sudigali sudheer
Roja : రోజా కామెంట్లతో అంతా షాక్
జడ్జ్‌గా ఉన్న రోజా కూడా సుధీర్‌పై భారీ కౌంటర్స్ వేస్తుంటుంది. తాజాగా సుధీర్‌పై రోజా వేసిన కౌంటర్ మాములుగా లేదని అంటున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందంటే.. తాజాగా స్కిట్స్‌లో శ్రీను, రామ్ ప్రసాద్, సుధీర్ ముగ్గురు మూడు షాప్స్ పెట్టుకుంటారు. అయితే సుధీర్ ఫ్రూట్స్ షాప్ పెట్టుకోగా.. అతని వద్దకు వచ్చిన బాబు.. నీ దగ్గర ఏంటి పూలు లేవు అని అడుగుతాడు. దానికి రోజా.. నలిపేసి ఉంటాడు అని అదిరిపోయే కౌంటర్ వేస్తుంది. దీంతో సుధీర్ ఏం అనాలో కూడా అర్థం కాలేదు.