RRR Movie : అక్కడ కూడా 50 శాతం… ఆర్‌ఆర్‌ఆర్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు..!
RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ను కరోనా కష్టాలు వదలడం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమా దేశ వ్యాప్తంగా పరిస్థితులు బాగుంటేనే విడుదల చేయాలని మేకర్స్ మొదటి నుండి భావిస్తూ వస్తున్నారు. అందుకే కాస్త ఆలస్యం అయినా గత ఏడాది వాయిదాల మీద వాయిదాలు వేసి ఎట్టకేలకు ఈ సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్దం అవ్వడం జరిగింది. ప్రమోషన్స్ పీక్స్ లో చేసి విడుదల వారం ఉండగా సినిమా వాయిదా పడబోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఔను నిజమే సినిమాను విడుదల చేయడం లేదు.. వాయిదా వేస్తాం అన్నట్లుగా మేకర్స్ నుండి ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వచ్చేనా అన్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల వాయిదాకు మరో కారణం దొరికింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఆంక్షలు.. 50 శాతం ఆక్యుపెన్సీ అమలు అవుతుంది. ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం కూడా కరోనా థర్డ్ వేవ్ భయంతో థియేటర్ల పై ఆంక్షలు విధిస్తున్నట్లుగా పేర్కొంది. నేటి నుండి అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే థియేటర్లు నడవాల్సి ఉంది. 50 శాతం ఆక్యుపెన్సీ అంటే జనాలు ఖచ్చితంగా కరోనా భయంతో అడుగు బయట పెట్టరు. 50 శాతం ఆక్యుపెన్సీ అయినా థియేటర్లలో కనిపించదు. కనుక ఆ సమయంలో సినిమాలు ఏవీ కూడా విడుదల చేయాలని మేకర్స్ భావించరు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ను కూడా విడుదల చేయక పోవడమే మంచిది అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.
RRR Movie ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల వాయిదా పక్కా…?
ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి.. మొదటి రోజే 100 నుండి 150 కోట్ల కు పైగా వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం ఈ సినిమా మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్ల వద్ద ఆంక్షలు.. ఇతర విషయాలు ఇబ్బందికరంగా మారితే కనీసం 50 కోట్ల వసూళ్లు కూడా ఆర్‌ఆర్‌ఆర్ కు వచ్చే అవకాశం ఉండదు. కనుక విడుదల కంటే వాయిదా ఉత్తమం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ మీడియా వ్యక్తి అయిన జీవి తన ట్విట్టర్ లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల వాయిదా పడబోతుంది.. సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ జోష్ ఉంటుంది.. కనుక విడుదల విషయంలో రాజీ పడ్డ తర్వాత విడుదల చేసిన సమయంలో ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఆయన ట్వీట్ ను బట్టి చూస్తే సినిమా విడుదల వాయిదా పక్కా అన్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.