RRR movie sequel
RRR Movie : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది. ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ గా మారారు. ఈ సినిమాలో ఇద్దరు కలిసి సొంత అన్నదమ్ముల కలిసిపోయి మరీ నటించారు. ఈ సినిమా హిట్ అవ్వడానికి వీరిద్దరు కూడా కారణం అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరోసారి కలిసిన నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. ఓ ప్రముఖ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ఈ పాన్ హీరోలతో మరో సినిమా ఉంటుందని ప్రకటించారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని, ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ అని అన్నారు. అయితే ఈ సినిమాకి దర్శకుడుగా రాజమౌళి ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఈ సీక్వెల్ పై రాజమౌళి తాలూకు పర్యవేక్షణ ఉంటుందని అన్నారు.
RRR movie sequel
దీంతో దర్శకుడు ఎవరన్న విషయంపై నెటిజన్స్ లో సందేహం నెలకొంది. విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేస్తారా లేక రాజమౌళి తనయుడు చేస్తారా లేక వేరే ఎవరైనా దర్శకుడు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ మహాభారతం ‘ సినిమా ఎప్పుడు ఉంటుందో అనే విషయాన్ని కూడా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక మహాభారతం ఉంటుందని అన్నారు. ఏది ఏమైనా రాంచరణ్ , ఎన్టీఆర్ తో మరో మల్టీ స్టారర్ సినిమా అంటే ప్రేక్షకులలో ఉత్సాహం పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.