RRR Movie : ఆర్ఆర్ఆర్ టీం భారీ ప్లాన్.. ఆరు రోజుల్లో 9 నగరాలు చుట్టేయనున్న హీరోహీరోయిన్స్
RRR Movie : మెగా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. 18వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రమోషన్స్ 23వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ముగియనున్నాయి. 18వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ సంబరాలు దుబాయ్ వరకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి యూనిట్ 19న బెంగళూరు చేరుకోనున్నారు. 20వ తేదీన బరోడాలోనూ భారీ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అదే 20వ తేదీన ఢిల్లీలోనూ ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఢిల్లీనుంచి 21వ తేదీన చిత్ర బృందం అమృత్‌సర్ చేరుకోనుంది.అదే రోజు రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లి భారీ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.
జైపూర్ నుంచి వెళ్లి 22వ తేదీన కోల్‌కతాలో జరిగే ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. అక్కడ్నుంచి అదే రోజు వారణాసి వెళ్లనున్నారు. వారణాసి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుని 23న ఆర్ఆర్ఆర్ మూవీ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. మొత్తానికి ఈ వారం రోజుల పాటు జరగనున్న ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం అందరు కూడా పాల్గొంటారని సమాచారం. గతంలో బాగానే ప్రమోషన్స్ చేసిన కరోనా వలన కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.ఇక ఆర్‌ఆర్‌ఆర్ విషయానికొస్తే.. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు.
RRR Movie : భారీ సినిమాకి బడా స్కెచ్..
తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హై బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు పెంపునకు అనుమతి ఇచ్చింది. దీనిపై రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.