Natu Natu Song : ఆస్కార్ గెలుచుకుంది అని సంబరపడిపోతున్నారు .. నాటు నాటు పాట వెనక దాగి ఉన్న 8 దారుణ నిజాలు ఇవే..!!
Natu Natu Song : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది అంతేకాకుండా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు వచ్చింది. కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా దేశమంతా గర్వించదగ్గ విషయం ఇది అని ప్రముఖులు భావిస్తున్నారు. లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది.
ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, పాటల రచయిత చంద్రబోస్, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పేర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే చాలా మందికి ఈ పాటకు సంబంధించిన విషయాలు తెలియవు. 1) 90% పాటను చంద్ర బోస్ సగం రోజుల్లో పూర్తి చేశారు. మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి 19 నెలలు పట్టింది. 2) ఇక కీరవాణి 20 కంటే ఎక్కువ ట్యూన్ లను రాజమౌళి వద్దకు తీసుకువచ్చారు. ఓటింగ్ ద్వారా ఫైనల్ చేశారు.
3) అలాగే నాటు నాటు పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ 110 స్టెప్పులను తీసుకువచ్చారు. అందులో ఈ స్టెప్పులు రాజమౌళి సెలెక్ట్ చేశారు. 4) చంద్ర బోస్ ఈ పాట రాయడానికి 19 నెలల కంటే ఎక్కువ టైం పట్టింది. 5) ఈ పాటలో కనపడే ప్యాలెస్ కైవ్ లోని ఉక్రెయిన్ అధ్యక్షుడు మారిన్స్కీ ప్యాలెస్. 6) ఈ పాట షూట్ చేసేందుకు 15 రోజుల సమయం పట్టింది. 350 మందికి పైగా ఈ పాటలో కనిపించారు. 7) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి ఏషియన్ పాట 8) రాజమౌళి ఎన్టీర్, రామ్ చరణ్ తో 18 సార్లు ఒక్క స్టెప్ ను వేపించారు.