RRR :‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్.. ‘నాటు నాటు’ సాంగ్‌కు చరణ్, తారక్ వీర నాటు స్టెప్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

RRR :‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్.. ‘నాటు నాటు’ సాంగ్‌కు చరణ్, తారక్ వీర నాటు స్టెప్స్..

RRR : దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రేమికులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీ మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు. ఫిల్మ్ నుంచి డ్యాన్స్ నెంబర్ అయిన ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ వేయగా.. అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాబులస్ హీరోలను […]

 Authored By praveen | The Telugu News | Updated on :10 November 2021,5:02 pm

RRR : దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రేమికులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీ మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు. ఫిల్మ్ నుంచి డ్యాన్స్ నెంబర్ అయిన ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ వేయగా..

rrr rrr naatu naatu song released

rrr-rrr-naatu-naatu-song-released

అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాబులస్ హీరోలను సింగిల్ ఫ్రేమ్‌లో చూసి సినీ ప్రేక్షకులు తెగ సంబురపడిపోతున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు. తమకు ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఇచ్చిన టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి ఈ సందర్భంగా మెగా, నందమూరి అభిమానులు థాంక్స్ చెప్తున్నారు.

RRR : రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘నాటు నాటు’ సాంగ్..

మొత్తంగా పాటతోనే సినిమా విడుదలైనంత సంబురం వచ్చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్ ’ఫిల్మ్ నుంచి ఇప్పటికే ‘దోస్తీ’ సాంగ్ విడుదల కాగా, తాజాగా ‘నాటు నాటు’ సాంగ్ విడుదలైంది.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది