RRR Movie postpone : ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక ఇంత పెద్ద స్టోరీ దాగుందా..? మరి ఫ్యాన్స్‌కు ఏం సమాధానమిస్తారు!
RRR Movie postpone : దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి ఇచ్చిన గ్రాండ్ స్టార్ ఇమేజ్‌తో మరోసారి పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండేండ్లుగా షూటింగ్ పూర్తి చేసుకుని ఎట్టకేలకు సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 7న RRR వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోందని తెలుసుకుని చాలా మేర చిన్న, పెద్ద సినిమాలు తమ విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ వినతి మేరకు పవన్ తన సినిమాను వాయిదా వేసుకున్నారు. ఫ్యాన్స్ అందరూ ఆర్ఆర్ఆర్ మూవీని చూసేందుకు మోస్ట్ అవెయింగ్‌తో ఉండగా.. మూవీ మేకర్స్ తీసుకున్న నిర్ణయం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇద్దరు అగ్రనటులు ఈ సినిమా కోసం కలిసి పనిచేశారు. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరిద్దరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉన్న హీరోలు.. వీరిద్దరిని దర్శకుడు రాజమౌళి ఓకే ఫ్రేంపై చూపించడంతో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు జనవరి 7ను అఫిషీయల్ రిలీజ్ డేట్‌గా ప్రకటించారు. అయితే, పాన్ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ ఈ మూవీ విడుదలవుతున్నందున కొన్ని అవాంతరాలు వచ్చి పడ్డాయట.. తెలుగు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ కీలకం. అమెరికాతో పాటు పలు దేశాల్లో ఒమిక్రాన్ స్వైర విహారం చేస్తోంది.
RRR Movie postpone : ఎందుకు వాయిదా వేశారంటే..
ఇప్పుడు మూవీ విడుదల చేస్తే ఆక్యుపెన్సీ తగ్గిపోయి కలెక్షన్లపై అది ప్రభావం చూపించవచ్చును. అదేవిధంగా ఏపీలో టికెట్ ధరలు తగ్గించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత దాన్యయ్యను డిస్కౌంట్ అడుగుతున్నారట.. తమిళనాడులో కూడా సేమ్ సిచువేషన్. అక్కడ 50శాతం థియేటర్లలో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కోసం రూ.40 కోట్లు ఖర్చుచేశారు. ఇండియా వైడ్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రచారం చేస్తోంది. దేశంలో కూడా కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో థియేటర్లు మళ్లీ మూతపడితే ఘోరంగా దెబ్బతింటామని ఈ సినిమాను సమ్మర్‌కు పోస్టుపోన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.