SS rajamouli : రాజమౌళి దెబ్బకు అల్లాడుతున్న నిర్మాతలు.. RRR వాయిదాతో ఎంత నష్టం వాటిల్లిందంటే?
SS rajamouli : దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్ ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆయన మొండితనం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. క్వాలిటీ ఔట్‌పుట్ కోసం రోజులు కాదు అవసరమైతే నెలలు కూడా తీసుకుంటాడు. జక్కన్న నిర్ణయాలు, మొండితనం వలన నిర్మాతలకు మాత్రం వాచిపోతుందని ఇండస్ట్రీలో టాక్. అయినప్పటికీ రాజమౌళి మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో ఎంత ఖర్చయినా భరించేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదట.. ప్రొడ్యూసర్లు రాజమౌళి నిర్ణయాన్ని కాదనడానికి ఎందుకు వెనుకాడరంటే.. గతంలో ఆయన తీసిన మగధీర, ఈగ, బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ ఇలా అన్నీ సూపర్ హిట్లే.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ కలెక్షన్లు రాబట్టాయి.
SS rajamouli : ఆర్ఆర్‌ఆర్ వాయిదాతో నిర్మాతలకు పెద్ద దెబ్బ..
ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని అనేక వాయిదాల తర్వాత ఫైనల్‌గా సంక్రాంతి బరిలో నిలిచింది. చిత్ర బృందం కూడా వేగంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా వైడ్ 14 భాషల్లో విడుదలవుతుండగా.. మరో కొన్నిరోజుల్లో తమ అభిమాన నటులను చూస్తామని అటు మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూశారు. తీరా చూస్తే మరోసారి సినిమా వాయిదా పడటంతో అంతా నిరాశకు లోనయ్యారు. ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు దేశంలో పలు రాష్ట్రాలో ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడ్డాయి. ఈ టైంలో సినిమా విడుదల చేస్తే కలెక్షన్లు తగ్గి భారీ నష్టం వాటిల్లుతుందని సినిమా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
అయితే, రాజమౌళి తీసుకున్న నిర్ణయంతో ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్యకు సినిమా కోసం అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడికి వడ్డీ పెరిగిపోతుందని టాక్.. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ రూ.450 కోట్లు.. అంతా భారీ తారాగణంతో పాటు విజువల్స్, ప్రమోషన్స్ కోసం నిర్మాత భారీగా ఖర్చుచేశారు. ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో ఉందని చాలా చిన్న, పెద్దలు సినిమాలు పోటీలో నుంచి తప్పుకున్నాయి. కానీ రాజమౌళి నిర్ణయంతో మరోసారి సినిమా వాయిదా పడటంతో ఓ నిర్మాతకు ఏకంగా రూ.25 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది.