Rajaniikanth : రజనీ కాంత్‌కి అవార్డ్ అందుకే ఇచ్చారంటూ రూమర్స్ మొదలయ్యాయి..ఏమంటున్నారో చూడండి..!
Rajaniikanth : రజనీకాంత్.. సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు మాత్రమే కాదు ఆరాధ్య దైవం గా భావించే వారు కోట్లలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. తమిళ నాడు ప్రేక్షకాభిమానులు..ప్రజలు తలైవర్‌గా పిలుచుకునే రజనీకాంత్ ఆయన సినిమాలతో ఎంతటి వారినైనా ప్రభావితం చేయగలరని చిన్న నుంచి పెద్దవరకు అందరూ చెప్పుకుంటారు. రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళ నాడు ప్రేక్షకులకి పెద్ద పండుగ వచ్చినట్టే. ఆయన సినిమా రిలీజవుతున్న రెండు మూడు రోజులు స్కూల్స్, కాలేజెస్..సాఫ్ట్ వేర్ కంపెనీస్..ఇలా ఒకటేమిటీ అన్నీ సెలవు ప్రకటించాల్సిందే.
ఇక కొన్ని కంపెనీలైతే స్వయంగా ఉద్యోగులకి టికెట్స్ ఇచ్చి మరీ ఆఫీస్ కి సెలవులు ప్రకటిస్తారు. అలాంటి పరిస్థితులు రజనీకాంత్ క్రియేట్ చేయగలరు. 1975 లో సినీ రంగ ప్రవేశం చేసిన రజనీకాంత్ దాదాపు 45 ఏళ్ళుగా ఎన్నో అద్బుతమైన సినిమాలను చేశారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా రజనీ ని దాట లేకపోయారు. ఇప్పటికీ వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. రజనీ రెమ్యూనరేషన్ పరంగా ఎవరూ పోటీ కాలేకపోతున్నారు.
Rajaniikanth : పొగడ్తలున్న చోటే .. విమర్శలు వెల్లువెత్తుతాయని అభిమానులు మాట్లాడుకుంటున్నారట.
ఇంతటి సుధీర్ఘ సినీ ప్రయాణంలో కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గాను 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు రజనీకాంత్ కి శుభాకాంక్షలు తెలుతూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. కానీ ఇందుకు సమానంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రజినీకి అవార్డ్ ప్రకటించడం ..ఆయన అభిమానులను ప్రభావితం చేయాలనే ఉద్దేశ్యమేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలో ప్రకటించిన అవార్డే అని కొన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నారు. అయితే ఇలాంటివన్నీ సర్వ సాధారణం.. పొగడ్తలున్న చోటే .. విమర్శలు వెల్లువెత్తుతాయని అభిమానులు మాట్లాడుకుంటున్నారట.