S/O Satyamurthy Child Artist : సన్ ఆఫ్ సత్యమూర్తిలో నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
S/O Satyamurthy Child Artist : సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నాఫ్ సత్యమూర్తి” మూవీ చూస్తే…మనకు మొదట గుర్తుకువచ్చేది…హీరో అల్లుఅర్జున్ తో కలిసి నటించిన బుల్లి పాప… బేబీ వెర్నికా..తన బులి మాటలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది…ఆ తర్వాత నాన్నకు ప్రేమతో చిత్రంలో కూడా నటించి అలరించింది… ఇంతకీ ఈ చిన్నారికి పెద్ద పెద్ద చిత్రాల్లో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అయితే అమ్మాయి చదువు పాడు కాకూడదు అని ఆమె తల్లి తండ్రులు సినిమాలు మానిపించేసారు,
ఇది ఇలా ఉండగా బేబీ వెర్నికా గురించి ఇటీవల బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.వెర్నికా తల్లి గారి పేరు జయ, తండ్రి గారి పేరు ప్రసాద్ , వీళ్లిద్దరికీ ఒక్కగానొక్క కూతురు ఈమె, వెర్నికా తల్లి జయ అప్పట్లో వెర్నికా ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసేది, ఆమె వెర్నికా ఫోటో అప్లోడ్ చేసిన ప్రతి సారి వాటికి వేల లైకులు మరియు షేర్లు వచ్చేవి, అలా ప్రతి రోజు వైరల్ అవుతున్న వెర్నికా ఫోటోలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దృష్టిలో పడింది.
వెర్నికా ఫోటోలను చూసి ఎంతో నచ్చినా త్రివిక్రమ్ స్వయంగా వెర్నికా తల్లి తండ్రులకు ఫోన్ చేసి ఒప్పించి ఆ సినిమా లో నటింపచేసారు. ఆ సినిమా నుండి వెర్నికాకి మంచి క్రేజ్ ఏర్పడింది. నాన్నకు ప్రేమతో చిత్రంలో కూడా బేబీ వెర్నికా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిన్ననాటి పాత్రలో ఇమిడిపోయి నటించింది… ఆ తర్వాత ఎన్ని సినిమా ఛాన్స్ లు వచ్చినా …పాప తల్లిదండ్రులు చదువు పాడైపోతుంది అనే భయంతో సినిమాలకు నో చెప్తున్నారు…. ఏమైతేనేమి బాలనటిగా బేబీ వెర్నికా నూటికి నూరు మార్కులు సంపాదించిందని చెప్పవచ్చు..