Sadha : అంతా చేసి ఆ హీరో చెల్లెమ్మ అన్నాడ‌ని చెప్పుకొచ్చిన స‌దా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sadha : అంతా చేసి ఆ హీరో చెల్లెమ్మ అన్నాడ‌ని చెప్పుకొచ్చిన స‌దా

 Authored By sandeep | The Telugu News | Updated on :1 August 2022,1:00 pm

Sadha : నితిన్ స‌ర‌స‌న న‌టించి వెళ్ల‌వ‌య్యా వెళ్లు అనే మాట‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ స‌దా. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది ఈ బ్యూటి. వరుసగా స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుని అటు కోలీవుడ్..ఇటు టాలీవుడ్ రెండింటిలోను నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటి..ప్రజెంట్ అవకాశాలు లేక ఖాళీ గా ఉంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ప్ర‌స్తుతం ఆ అమ్మ‌డికి కూడా క్రేజ్ పెరుగుతూ పోతుంది. అయితే స‌దా తాజాగా ఓ హీరో గురించి స్ట‌న్నింగ్ కామెంట్స్ చేయ‌గా, అవి వైర‌ల్ అయ్యాయి.
స‌దా ముచ్చ‌ట్లు..

హీరోయిన్ సదా కెరీర్ లో అపరిచితుడు బిగ్గెస్ట్ హిట్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది, కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అపరిచితుడు మూవీలో విక్రమ్ నటన అద్భుతమని చెప్పాలి. ఆయన కమల్ హాసన్ లాంటి గొప్ప నటులను గుర్తు చేశారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు సదా గుర్తు చేసుకున్నారు. విక్రమ్ తో నా పెయిర్ బాగుంది. మా మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరిందని సెట్స్ లో అందరూ చెప్పుకునేవారు. అయితే హీరో విక్రమ్ మాత్రం నన్ను సిస్టర్ అని పిలిచేవాడు.

Sadha intresting comments viral

Sadha intresting comments viral

కథలో భాగంగా మేమిద్దరం కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించాల్సి వచ్చింది. డైరెక్టర్ శంకర్ షాట్ రెడీ అనగానే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేవాళ్ళం. డైరెక్టర్ కట్ చెప్పాక విక్రమ్ నన్ను చెల్లి అంటూ పిలిచేవారు. ఇది చూసి సెట్స్ లో ఉన్న సిబ్బంది, నేను నవ్వుకునేవాళ్ళం. మళ్లీ పక్క రోజు సినిమా షూటింగ్ రోమాంటిక్ సీన్స్ అప్పుడు..సిస్టర్ అంటూ స్టార్ట్ చేసేవాడు..ఇలానే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది..” అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయమై డైరెక్టర్ శంకర్ సీరియస్ అయ్యాడు. ప్రేక్షకులు హీరో హీరోయిన్ అంటే లవర్స్ భావనలో చూస్తారు. మీరు ఇలా అన్నా చెల్లి అని పిలుచుకుంటారని బయటికి తెలిస్తే… మొత్తం నాశనం అవుతుంది. రేపు తెరపై మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేరని శంకర్ అన్నారట.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది