Sai dharam tej: మెగా మేనల్లుడుకి రోడ్డు ప్రమాదం..ఆసుపత్రికి తరలింపు..షాక్‌లో మెగా ఫ్యామిలీ
Sai dharam tej: మెగా ఫ్యామిలీ పెద్ద షాకింగ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి సోదరి కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరం తేజ్ కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వద్ద నున్న కేబుల్ బ్రిడ్జ్ ఫై సాయి ధరం తేజ్ కి ఈ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైకుపై వెళుతూ ప్రమాదవశాత్తు సాయి ధరమ్ తేజ్ పడిపోయాడు. దాంతో ఆయన కుడి కంటికి, చాతి భాగంలో, పొట్ట భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. దాంతో అపస్మారక స్థితిలో ఉన్న సాయి ధరం తేజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

sai-dharam-tej met with an accident at hyderabad
ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. దీంతో మెగా ఫ్యామిలీ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా తనకి ఎలాంటి ప్రమాదం లేదని..త్వరలోనే రికవర్ అవుతానని సాయి ధరం తేజ్ ఆయన ట్విట్టర్ ద్వారా సందేశం పంపాడు. అలాగే డాక్టర్లు కూడా ఆయన ప్రాణానికి ఏమీ హాని లేదని తెలిపారు.