Sai Dharam Tej : తన బ్రేకప్ స్టోరీ చెప్పినా సాయి ధరమ్ తేజ్ వీడియో వైరల్..!!
Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ అందరికీ సుపరిచితుడే. గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన ఈ మెగా హీరో తృటిలో ప్రాణగండం నుండి తప్పించుకున్నాడు. తలకి హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడటం జరిగింది. అయితే ఆ సమయంలో మాట కోల్పోవడంతో చాలా నెలలు.. సాయి ధరమ్ తేజ్ అనేక అవస్థలు పడటం జరిగింది. ఆ తర్వాత మొత్తం రికవరీ కావడం
ఇప్పుడు ఆయన నటించిన విరూపాక్ష రిలీజ్ అవటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న సాయి ధరంతేజ్ బిత్తిరి సత్తి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి గురించి ప్రశ్న వేసిన సమయంలో అది జరగాల్సిన టైంలో జరుగుతుందని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నాడు.
స్వతహాగా లవ్ ట్రాక్స్ గురించి బిత్తిరి సత్తి ప్రశ్నించగా అటువంటిది ఏమీ లేవని తెలిపారు. ఆంజనేయ స్వామి భక్తుడిని జాగ్రత్తగా అన్ని నిగ్రహించుకుని.. అధిగమించి ముందుకు వెళ్తాను. ఒకప్పుడు ప్రేమలో పడ్డాను చాలా దెబ్బ తగిలింది. ఇంకా అప్పటినుండి చాలా సైలెంట్ అయిపోయాను అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ సాయిధరమ్ తేజ్ తెలియజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.