Sai Pallavi Nithiin : ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు వేణు. ఆ సినిమాకు అవార్డులతో పాటు, మంచి వసూళ్లూ దక్కాయి. ఇప్పుడు తన రెండో సినిమా ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. నానితో వేణు ఓ సినిమా చేస్తున్నాడన్న ప్రచారం అప్పట్లో బాగా నడిచింది. కాని ఎందుకో ఆ సినిమా ఆగినట్టు తెలుస్తుంది. అయితే వేణు ఎల్లమ్మ అనే కథ తయారు చేసుకోగా, దిల్ రాజు బ్యానర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో హీరో కోసం కొన్నాళ్లుగా వేణు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. నితిన్, శర్వానంద్ లాంటి హీరోలకు కథ చెప్పాడు. చివరికి నితిన్ ఓకే అయ్యాడు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
‘బలగం’లానే ‘ఎల్లమ్మ’ కూడా తెలంగాణ నేపథ్యంలో సాగేదే. తెలంగాణ సంస్కృతి, మట్టివాసన ఈ కథలో కనిపించనున్నాయి. ‘కాంతార’ తరహాలో బలమైన క్లైమాక్స్ ఈ కథలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్‌వుడ్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తయిన వెంటనే ‘ఎల్లమ్మ’ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ కథలో కథానాయిక పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నట్టు సమాచారం. అలానే సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.త్వరలో షూటింగ్ మొదలు కానుంది.
ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు గానూ ఓ స్టార్ కావాలి. అందుకే ఈ కథ సాయి పల్లవి దగ్గరకు వెళ్లింది. కథ సాయి పల్లవికి బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. సాయిపల్లవి నటించిన ‘తండేల్’ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆ తరవాత.. ‘ఎల్లమ్మ’ సెట్స్‌పైకి వెళ్తుంది. నితిన్ నుంచి కూడా ‘రాబిన్‌వుడ్’ రావాలి. ‘తమ్ముడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె.కుమార్ కథకు ఓకే చెప్పాడు నితిన్. ‘ఎల్లమ్మ’తో పాటు ఆ సినిమా కూడా సమాంతరంగా పూర్తి చేస్తాడు. మొత్తానికి వేణు తన రెండో సినిమాతో కూడా తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నట్టు అర్ధమవుతుంది.
Ap Intermediate 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న…
Zodiac Signs : రానున్న సంవత్సరంలో ముఖ్యంగా జనవరిలో గ్రహాల రవాణా అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరు కూల్ లుక్ తో…
Krithi Shetty : ఉప్పెన భామ కృతి శెట్టి సినిమాల వేగం తగ్గింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే…
Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప2లో…
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్…
Jr NTR : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో…
Health Benefits : 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీలో ఆ స్టామినా మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని ఆహారాలు…
This website uses cookies.