Sai Pallavi Nithiin : బంపర్ ఆఫర్ కొట్టిన వేణు.. సాయి పల్లవి , నితిన్‌తో ఎల్లమ్మ సినిమా చేయబోతున్నాడా..!
ప్రధానాంశాలు:
Sai Pallavi Nithiin : బంపర్ ఆఫర్ కొట్టిన వేణు.. సాయి పల్లవి , నితిన్‌తో ఎల్లమ్మ సినిమా చేయబోతున్నాడా..!
Sai Pallavi Nithiin : ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు వేణు. ఆ సినిమాకు అవార్డులతో పాటు, మంచి వసూళ్లూ దక్కాయి. ఇప్పుడు తన రెండో సినిమా ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. నానితో వేణు ఓ సినిమా చేస్తున్నాడన్న ప్రచారం అప్పట్లో బాగా నడిచింది. కాని ఎందుకో ఆ సినిమా ఆగినట్టు తెలుస్తుంది. అయితే వేణు ఎల్లమ్మ అనే కథ తయారు చేసుకోగా, దిల్ రాజు బ్యానర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో హీరో కోసం కొన్నాళ్లుగా వేణు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. నితిన్, శర్వానంద్ లాంటి హీరోలకు కథ చెప్పాడు. చివరికి నితిన్ ఓకే అయ్యాడు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
Sai Pallavi Nithiin క్రేజీ ఛాన్స్..
‘బలగం’లానే ‘ఎల్లమ్మ’ కూడా తెలంగాణ నేపథ్యంలో సాగేదే. తెలంగాణ సంస్కృతి, మట్టివాసన ఈ కథలో కనిపించనున్నాయి. ‘కాంతార’ తరహాలో బలమైన క్లైమాక్స్ ఈ కథలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్‌వుడ్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తయిన వెంటనే ‘ఎల్లమ్మ’ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ కథలో కథానాయిక పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నట్టు సమాచారం. అలానే సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.త్వరలో షూటింగ్ మొదలు కానుంది.
ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు గానూ ఓ స్టార్ కావాలి. అందుకే ఈ కథ సాయి పల్లవి దగ్గరకు వెళ్లింది. కథ సాయి పల్లవికి బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. సాయిపల్లవి నటించిన ‘తండేల్’ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆ తరవాత.. ‘ఎల్లమ్మ’ సెట్స్‌పైకి వెళ్తుంది. నితిన్ నుంచి కూడా ‘రాబిన్‌వుడ్’ రావాలి. ‘తమ్ముడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె.కుమార్ కథకు ఓకే చెప్పాడు నితిన్. ‘ఎల్లమ్మ’తో పాటు ఆ సినిమా కూడా సమాంతరంగా పూర్తి చేస్తాడు. మొత్తానికి వేణు తన రెండో సినిమాతో కూడా తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నట్టు అర్ధమవుతుంది.