పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఎంత మంది క్యూలో ఉంటారో లెక్క చెప్పలేము. పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి జంటగా నటించిన శృతిహాసన్ లాంటి వాళ్ళు ఐరెన్ అన్న ముద్ర తొలగించుకొని స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. అంతేకాదు వకీల్ సాబ్ లో శృతిహాసన్ మూడవ సారి పవన్ కళ్యాణ్ తో నటిస్తోంది. చాలామంది హీరోయిన్స్ కి స్టార్ డం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ నటించడానికి వెనకడడు.
కాగా ప్రస్తుతం వకీల్ సాబ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నపవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరో గా నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది.
కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా సాయి పల్లవి, రానా కి జంటగా ఐశ్వర్య రాజేష్ నటించబోతుందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించడానికి సాయి పల్లవి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది తెలుస్తోంది. ఇది నిజమా కాదా అన్నది తెలియనప్పటికి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సాయి పల్లవి ఈ సినిమాలో వారం నుండి పది రోజులు నటించేందుకు రెగ్యులర్ సినిమా కి అడిగినట్టుగానే రెండు కోట్లు రెమ్యూనరేషన్ చెప్పినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కి జంటగా అది కూడా అతి తక్కువ రోజులు అయినా సరే సాయి పల్లవి మాత్రం రెమ్యూనరేష విషయంలో కాంప్రమైజ్ కావడం లేదన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి అఫీషియల్ గా ఈ విషయం వెల్లడైతేనే నమ్మడానికి వీల్లేదు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.