JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ను డామినేట్ చేయడం గ్యారెంటీనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ను డామినేట్ చేయడం గ్యారెంటీనా..?

 Authored By govind | The Telugu News | Updated on :24 May 2022,8:30 pm

JR NTR : ఫిదా బ్యూటీ సాయి పల్లవికి సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మలయాళ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. నేచురల్ పర్ఫార్మర్‌గా సాయి పల్లవికి ఉన్న పేరు ఏ పాటిదో అందరికీ తెలిసిందే. ఇక టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే సాయి పల్లవి గురించి మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఢీ సీజన్ ప్రారంభంలో సాయి పల్లవి కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి ఆకట్టుకుంది.

ఆ రకంగా సాయి పల్లవి మంచిన్ డాన్సర్‌గానూ పాపులర్ అయింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో సాయి పల్లవి డాన్స్ విషయంలో టాప్ అని చెప్పాలి. ఒక మాదిరిగా డాన్స్ చేసే హీరోలు ఆమెతో డాన్స్ అంటే కాస్త ఆలోచిస్తారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా సాయి పల్లవిని తన పక్కన చెల్లి పాత్ర కంటే పోటాపోటీగా డాన్స్ చేసేందుకు హీరోయిన్‌గా నటించాలని ఉందనే విషయాన్ని ఓపెన్‌గానే చెప్పారు. అంత క్రేజ్ ఉంది సాయి పల్లవి డాన్స్‌కి. అయితే, ఇలాంటి నేచురల్ బ్యూటీ డాన్స్‌లో ఇదరగీసే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన నటించే అవకాశం అంటే అందరూ ముందు డాన్స్ విషయమే మాట్లాడుకుంటుంటారు.

Sai Pallavi Dominating in Junior NTR

Sai Pallavi Dominating in Junior NTR

JR NTR : ఎన్.టి.ఆర్ – సాయి పల్లవి కాంబినేషన్ అంటే అద్భుతం..

ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్ మీదకు రాబోతోంది. ఇది ఎన్.టి.ఆర్ 30 కాగా, వాస్తవంగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం మేరకు ఈ మూవీలో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంచుకునే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారట. ఎన్.టి.ఆర్ – సాయి పల్లవి కాంబినేషన్ అంటే అద్భుతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పర్ఫార్మెన్స్ పరంగా ఖచ్చితంగా పోటీపడి నటిస్తారు. ఇక డాన్స్ విషయంలోనే ఇద్దరూ ఒద్దరే కాబట్టి గ్యారెంటీగా గట్టి పోటీ ఉంటుంది. ఈ సినిమాలో నిజంగా సాయి పల్లవి హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయితే, తారక్‌ను డాన్స్‌లో డామినేట్ చేస్తుందేమో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది