Sai Pallavi : సాయి పల్లవి పేరు తెలిసిన ప్రతీ ఒక్కరూ కంట్లో నీళ్ళు పెట్టుకునే బ్రేకింగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sai Pallavi : సాయి పల్లవి పేరు తెలిసిన ప్రతీ ఒక్కరూ కంట్లో నీళ్ళు పెట్టుకునే బ్రేకింగ్ న్యూస్ !

 Authored By prabhas | The Telugu News | Updated on :9 January 2023,4:20 pm

Sai Pallavi : తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ ఫిదా ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది సాయి పల్లవి. ఆ సినిమాలో తన అందం, నటనతో అందరినీ ఫిదా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే గత కొద్దికాలంగా సాయి పల్లవి గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనీ, డాక్టర్ కావాలనీ చూస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దానికోసం ఆమె హాస్పిటల్ కూడా నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. అందుకనే కొత్త సినిమాల గురించి ఎటువంటి

అప్డేట్ ఇవ్వట్లేదని వార్తలు వస్తున్నాయి. తెలుగులో సాయి పల్లవి చివరిగా నటించిన సినిమా గార్గి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే ఈ వార్తలు మరింత వైరల్ గా మారాయి. తాజాగా వీటన్నింటికీ సాయి పల్లవి క్లారిటీ ఇచ్చేసింది. ‘ ప్రేమమ్ ‘ సినిమాతో నా సినీ కెరీర్ మొదలైంది. ఆ చిత్రం అంత పెద్దగా సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు, ఈ సినిమాల టీచర్ ఇమేజ్ను మార్చడానికి వేరే తరహా పాత్రలో నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాననీ తెలియజేసింది.

sai pallavi good bye to movies

sai pallavi good bye to movies

అలాగే సాయి పల్లవి మాట్లాడుతూ నేను ఎంబిబిఎస్ చదివిన నటి కావాలని అనుకున్నాను. దీనికి నా పేరెంట్స్ ఎటువంటి అడ్డు చెప్పలేదని తెలిపింది. నేను నటించే సినిమాల లోని పాత్రలు ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని అనుకుంటాను. అందరూ కూడా నన్ను తమ ఆడపడుచులాగా భావిస్తుండడం చాలా సంతోషంగా ఉందని, మంచి కథ దొరికితే ఏ భాషలో నేను నటించడానికి రెడీ అని చెప్పింది. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పేసిందన్న వార్తలు నిజం కాదని తేలిపోయాయి. దీంతో సాయి పల్లవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది