Chiranjeevi : చిరును చూసి ఫిదా.. హగ్గులు, కాళ్లు మొక్కిన సాయి పల్లవి

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 20, 2021, 1:44 pm

Chiranjeevi  మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi అన్నా, ఆయన డ్యాన్సులు, గ్రేసులు అన్నా తెలియని వాళ్లెవ్వరూ ఉండరు. ఇక తెరపై డ్యాన్సులు వేయాలంటే అది చిరంజీవి తరువాతే. గ్రేసుతో కూడా డ్యాన్స్ అంటే చిరు వేయాల్సిందే. అయితే ఇప్పుడు అంతటి గ్రేసుతో   డ్యాన్స్ వేయగల హీరోయిన్లు ఎవ్వరూ లేరు. ఈ మధ్య కాలంలో సాయి పల్లవి మాత్రం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమె డ్యాన్స్ చేస్తే నెమలి నాట్యమాడినట్టే ఉంటుందని అంతా అంటారు. అలాంటి సాయి పల్లవి డ్యాన్సులకు చిరు కూడా ఫిదా అయ్యారట. లవ్ స్టోరీ ఈవెంట్‌లో చిరు, సాయి పల్లవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు…

Sai Pallavi Touches Chiranjeevi Feet In Love Story Event

Sai Pallavi Touches Chiranjeevi Feet In Love Story Event

కాళ్లు మొక్కిన సాయి పల్లవి Chiranjeevi

ఫిదా సినిమాలో సాయి పల్లవిని మాత్రమే చూశాడట. వరుణ్ తేజ్‌ను చూడలేదని స్టేజ్ మీదే చిరంజీవి చెప్పాడు. అలాంటి సాయి పల్లవికి తన సినిమాలో చెల్లి పాత్రను ఇస్తే నో అని చెప్పిందట. అయితే ఆమెతో చెల్లి పాత్రను కూడా మాస్ నంబర్ డ్యాన్స్ వేసే రోల్ చేయాలని   చిరు మనసులోఉందట. ఆమె ఈ చిత్రానికి నో చెప్పాలని మనసులో అనుకున్నాడట.. అలానే సాయి పల్లవి కూడా నో చెప్పిందట. ఇలా సాయి పల్లవి నో చెప్పడం గురించి చిరు స్టేజ్ మీద చెప్పడంతో ఆమె అవాక్కైంది.

 

Sai Pallavi Touches Chiranjeevi Feet In Love Story Event

Sai Pallavi Touches Chiranjeevi Feet In Love Story Event

మధ్యలో మైక్ అందుకుని.. నేను అలా నో చెప్పలేదు.. నాకు రీమేక్‌లంటే భయం. అందుకే నో చెప్పాను.. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఒక్కరినీ మీ గురించే అడిగాను.. రామ్ చరణ్‌ను ఓసారి కలిశాను.. మిమ్మల్ని ఎప్పుడైనా కలుస్తాను అని అనుకున్నా.. ఇలా కలిశాను. మీరంటే నాకు అంత ఇష్టం సర్ అని సాయి పల్లవి తన అభిమానాన్ని చాటింది. అయితే స్టేజ్ మీదకు ఎక్కిన తరువాత సాయి పల్లవి, చిరు పక్కనే నిల్చుంది. ముచ్చట్లు పెట్టింది. హగ్ చేసుకున్నారు. ఇక చిరు వెళ్లేటప్పుడు కాళ్లు కూడా మొక్కింది.

Sai Pallavi Touches Chiranjeevi Feet In Love Story Event

Sai Pallavi Touches Chiranjeevi Feet In Love Story Event

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp