Nirmalamma : నిర్మలమ్మ వల్లే సావిత్రి, అంజలి దేవీలకి స్టార్‌డమ్ వచ్చింది.. ఎలా అంటే,..?
Nirmalamma : ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మకి చిన్నప్పటి నుంచే నాటకాలు వేసే అవకాశాలు వచ్చాయి. అలా ఆమె స్టేజ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. 10వ తరగతి వరకు చదువుతూ..నాటకాలలో మంచి పాత్రలు పోషించి బాగా పేరు తెచ్చుకున్నారు. అయితే నాటకాల వల్ల నిర్మలమ్మ మగరాయుడిలా తిరుగుతున్నారని ఇంట్లో వాళ్ళు కాస్త మందలిస్తుండేవారు. కానీ అవన్ని నిర్మలమ్మ మాత్రం పట్టించుకునేవారు కాదు. అయితే ఆమె పెదనాన్న కూడా నాటకాలలో పాత్రలు వేసేవారు. దాంతో నిర్మలమ్మకి పెదనాన్న […]
Nirmalamma : ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మకి చిన్నప్పటి నుంచే నాటకాలు వేసే అవకాశాలు వచ్చాయి. అలా ఆమె స్టేజ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. 10వ తరగతి వరకు చదువుతూ..నాటకాలలో మంచి పాత్రలు పోషించి బాగా పేరు తెచ్చుకున్నారు. అయితే నాటకాల వల్ల నిర్మలమ్మ మగరాయుడిలా తిరుగుతున్నారని ఇంట్లో వాళ్ళు కాస్త మందలిస్తుండేవారు. కానీ అవన్ని నిర్మలమ్మ మాత్రం పట్టించుకునేవారు కాదు. అయితే ఆమె పెదనాన్న కూడా నాటకాలలో పాత్రలు వేసేవారు. దాంతో నిర్మలమ్మకి పెదనాన్న నుంచి కొంత సపోర్ట్ లభించేది.
ఇక పెద్దదయ్యాక నిర్మలమ్మకి రామాయాణం, మహా భారతం లాంటి పురాణాలు. కథలు చదువుతుండేవారు. ఆమె అందంగా ఉంటారని నటిగా మంచి భవిష్యత్తు ఉందని అందరూ చెప్పడంతో తనకీ నటిగా ఎదగాలని ఆశ కలిగింది. దాంతో చదువు మధ్యలోనే ఆపేశారు. సినిమా అవకాశాలు ఎలా సంపాదించుకోవాలో మాత్రం తెలియలేదు. సినిమాలలో నటించే అవకాశం దక్కించుకోవాలంటే మద్రాసు వెళ్ళి ప్రయత్నించాలి. అదెలాగో నిర్మలమ్మకి తెలియలేదు. అయితే అప్పట్లో నాటకాలు వేస్తున్న వాళ్ళకే ఎక్కువ సినిమాలలో అవకాశాలిచ్చేవారు.
Nirmalamma : బాధపడి ఇక సినిమాలు చేయకూడదని డిసైడయ్యారు.
అలా ఓసారి దర్శకుడు బలరామయ్య గరుడ గర్వభంగ అనే సినిమా కోసం విజయవాడ వచ్చి నిర్మలమ్మ వేసిన నాటకం చూశారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలో ఓ చెలికత్తె పాత్ర ఇచ్చారు. ఆ రకంగా ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది. 1973 లో మొదటి సినిమా విడుదల ఆ తర్వాత 1944 పాదుకా పట్టాభిషేకం రెండవ సినిమా వచ్చాయి. కానీ రెండవ సినిమాలో ఆమె పాత్ర సినిమాలో లేకపోవడంతో బాధపడి ఇక సినిమాలు చేయకూడదని డిసైడయ్యారు. పూర్తిగా నాటకాల మీద దృష్టిపెట్టారు. అయితే ఓ సందర్భంలో బాలీవుడ్ నటుడు పృధ్వి రాజ్ కుమార్ ..నువ్వు ఎప్పటికైనా మంచి నటి అవుతావని చెప్పారు.
Nirmalamma : ఆ హీరోయిన్ పాత్రను రిజెక్ట్ చేశారు.
1954లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అక్కినేని నాగేశ్వరరావు తో తీస్తున్న ఆడ పెత్తనం అనే సినిమాలో హీరోయిన్‌గా అడిగారు. కానీ ఆమెకి జరిగిన అవమానం గుర్తుపెట్టుకొని ఆ హీరోయిన్ పాత్రను రిజెక్ట్ చేశారు. ఆ అవకాశం అంజలీదేవికి దక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో అంజలీదేవి స్టార్ హీరోయిన్ అయ్యారు. ఈ సినిమా సక్సెస్ చూసిన నిర్మలమ్మ మళ్ళీ సినిమాలు చేయాలని నిర్ణయించుకొని వెళితే అక్క, వదిన, అమ్మ పాత్రలు వచ్చాయి. ఆ రకంగా స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన నిర్మలమ్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోయింది.