Samantha Akkineni : దర్శకుడికి సారీ చెప్పిన సమంత.. కారణం ఏంటంటే?
Samantha Akkineni : సమంత ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలోనటిస్తోన్న సంగతితెలిసిందే. నానూ రౌడీదానే అంటూ విజయ్ సేతుపతి, నయనతార కాంబోలో విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన సినిమా ఘన విజయం సాధించింది. ఆసినిమాతో నయన్‌ను ప్రేమలోకి దింపేశాడు విఘ్నేశ్. అలా అప్పటి నుంచి ఇద్దరూ కూడా పీకల్లోతు ప్రేమలో ముగినిపోయారు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ విఘ్నేశ్ శివన్ నయనతారతో మరో సినిమాను చేస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి సమంత కూడా నటిస్తున్నారు.
అలా సమంత, నయనతారను ఒకే ప్రాజెక్ట్‌లోకి తీసుకురావడంతో విఘ్నేశ్ శివన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. సౌత్ లేడీ సూపర్ స్టార్స్ ఇద్దరినీ ఒకే సినిమాలో పెట్టేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. మొత్తంగా కాతవాక్కుల్ రెండు కాదల్ అనే సినిమాను విఘ్నేశ్ శివన్ ప్రారంభించేశాడు. ఇప్పటికే విజయ్ సేతుపతి, సమంత, నయన్‌లు షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా అర్ధరాత్రి దాటాకే జరుగుతోంది. గత రెండు మూడు రోజులుగా లేట్ నైట్ షూటింగ్‌లతో టీం మొత్తం బిజీగా ఉంటోంది.

Samantha Akkineni sorry to Vignesh Shivan
దర్శకుడికి సారీ చెప్పిన సమంత.. : Samantha Akkineni
అయితే తాజాగా సమంత నిన్న రాత్రి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఏదైనా ప్రశ్నలు సంధించండని చెప్పుకొచ్చింది. అలా చాలా సేపు అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఇక చివరకు సినిమా షూటింగ్ టైం అవుతోందంటూ చెప్పేసింది. కాతవాక్కుల్ రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నానని, ఇప్పుడు షూటింగ్‌కు వెళ్లాలని, ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ఎంజాయ్ చేస్తారని సమంత చెప్పేసింది. అలా సినిమా గురించి ముందే చెప్పేసినందుకు సారీ అంటు విఘ్నేశ్ శివన్‌ను కోరింది.